
రాజ్‌భవన్‌లోని దర్బార్‌హాల్‌లో ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌తో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్ నరసింహన్. చిత్రంలో సీఎం కేసీఆర్, మాజీస్పీకర్ మధుసూదనాచారి
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ప్రొటెం (తాత్కాలిక) స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్‌ఖాన్ బుధవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌హాల్‌లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించారు. అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు తాత్కాలిక స్పీకర్ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను చదివి వినిపించారు. ప్రమాణ స్వీకారం అనంతరం తాత్కాలిక స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ‘ప్రమాణపత్రం’పై గవర్నర్ సమక్షంలో సంతకం చేశారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, మాజీ స్పీకర్ ఎస్. మధుసూదనాచారి తాత్కాలిక స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌కు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ వి. స్వామిగౌడ్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, బి. వినోద్ కుమార్, జి. సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బి. వెంకటేశ్వర్లు, అమీన్ జాఫ్రీ, ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ, మహ్మద్ మోజంఖాన్, కౌసర్ మోహినుద్దీన్, అహ్మద్ బలాల, వి. శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె. జోషి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment