సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో గురువారం జరుగనున్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉంటా నని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పునరుద్ఘాటించారు. హిందూ ధర్మం పట్ల వ్యతిరేకంగా ఉండే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే, ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ముందు తాను ప్రమాణం చేయనని బుధవారం ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఇదే అంశంపై ఈనెల 6న వాట్సాప్ వీడియోను విడుదల చేసిన రాజాసింగ్ బుధవారం పునరుద్ఘాటించారు. తాను గురువారం అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment