సాక్షి, హైదరాబాద్: తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలతో కరడుగట్టిన హిందుత్వవాదిగా ముద్రపడిన ఆయన.. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ప్రమాణం స్వీకారం చేయరాదని నిర్ణయించారు. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ఎంఐఎం సీనియర్ నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంఐఎం హిందూధర్మానికి వ్యతిరేకమైన పార్టీ అని, అందుకే ఆ పార్టీ నేత ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయరాదని నిర్ణయించానని ఆయన ఒక వీడియోలో తెలిపారు. అవసరమైతే ఈ విషయాన్ని చట్టబద్ధంగా ఎదుర్కోవడానికీ సిద్ధంగా ఉన్నానన్నారు. కొత్త స్పీకర్ ఎన్నికైన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం చేస్తానని రాజాసింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment