సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, గోకుల్‌పురి ఎమ్మెల్యే చౌదరి ఫతే సింగ్ ఢిల్లీ అసెంబ్లీ ఆరో ప్రొటెం స్పీకర్ కానున్నారు. ఎమ్మెల్యేలందరిలోకి సీనియర్ అయిన ఆయనను ప్రొటెం స్పీకర్ చేయాలని ఆప్ నిర్ణయించింది. చౌదరి 1993 తొలి అసెంబ్లీలో బీజేపీ తరఫున నందనపురి ఎమ్మెల్యేగా పనిచేశారు.
ఫిబ్రవరి 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 23 నుంచి మొదలుకానున్నాయి. మొదటి రోజు ప్రొటెం స్పీకర్ శాసనసభకు ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఫిబ్రవరి 24న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. షహదరా ఎమ్మెల్యే రామ్ నివాస్ గోయల్‌ను స్పీకర్‌గా, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే వందనా కుమారిని డిప్యూటీ స్పీకర్‌గా నియమించాని ఆప్ నిర్ణయించింది.
ప్రొటెం స్పీకర్‌గా చౌదరి ఫతే సింగ్
Published Thu, Feb 19 2015 11:26 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement