
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీలో శనివారం బల నిరూపణను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కాంగ్రెస్ - జేడీఎస్ అధినేతలు తాజ్‌కృష్ణ హోటల్‌లో ఏర్పాటు చేసిన కర్ణాటక సీఎల్పీ సమావేశం ముగిసింది. కర్ణాటక సీఎల్పీ నేతగా సిద్ధారామయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిన్నర్ తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరనున్నారు. వారికి టీ కాంగ్రెస్ ఏపీ సరిహద్దు వరకు 200 వాహనాల కాన్వాయ్‌ను ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి ఏపీసీసీ, కర్ణాటక నాయకుల కాన్వాయ్ జత చేరనుంది.
Comments
Please login to add a commentAdd a comment