అసెంబ్లీలో విశ్వాస పరీక్ష గురించి తానేమీ భయపడట్లేదని, ప్రభుత్వం ఎన్నాళ్లున్నా తమకొచ్చిన ఇబ్బందేమీ లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
అసెంబ్లీలో విశ్వాస పరీక్ష గురించి తానేమీ భయపడట్లేదని, ప్రభుత్వం ఎన్నాళ్లున్నా తమకొచ్చిన ఇబ్బందేమీ లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అసెంబ్లీకి వచ్చిన సందర్భంగా మీడియా ఆయన్ను చుట్టుముట్టి ప్రశ్నలు సంధించినప్పుడు ఆయనిలా స్పందించారు. తమకు ఏమైనా భయం ఉంటే ఈరోజు గుడికి వెళ్లి ప్రార్థించేవాడినని నవ్వుతూ చెప్పారు.
కాగా, ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై ఓటింగ్ సాయంత్రం ఐదు గంటలకు జరిగే అవకాశముంది. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో మేజిక్ మార్కు 36 కాగా.. ఆమ్ ఆద్మీ పార్టీకి 28 మంది సభ్యులున్నారు. సర్కారుకు బయటినుంచి మద్దతిస్తున్న కాంగ్రెస్ పార్టీకి 8 మంది సభ్యులున్నారు. కాగా, తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విప్ జారీచేసింది.