
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ రేపు(సోమవారం) అత్యవసరంగా సమావేశం కానుంది. బిల్లుల ఆమోదానికి గవర్నర్‌కు కాలపరిమితి విధించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలని ఎలా పక్కదోవ పట్టిస్తుందో అనే అంశంపై అసెంబ్లీలో చర్చించనున్నట్లు ఢిల్లీ అసెంబ్లీ సెక్రటీ రాజ్ కుమార్ తెలిపారు.