గత నాలుగు రోజులుగా క్షణ క్షణానికి మారుతున్న కన్నడ రాజకీయాలు హైదరాబాద్ నుంచి తిరిగి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాల కసరత్తు అనంతరం క్యాంప్ రాజకీయాలు మరింత వేడిగా మారాయి. కర్ణాటక పీఠం దక్కించుకోవడం అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా పరిణమించింది. దీంతో ఎవరు వ్యూహాలు పై చేయి సాధించనున్నాయి. కర్ణాటక పీఠం ఎవరికి దక్కనుంది? విజేత ఎవరు? ఇపుడిదే బిగ్ డిబేట్. ఈ రోజు(శనివారం) సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్న బలపరీక్ష నేపథ్యంలో బెంగళూరు విధాన సౌధ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.