మణిపూర్: మణిపూర్‌లో కొత్తగా ఏర్పాటైన బీజేపీ సర్కార్ తొలి పరీక్షను విజయవంతంగా ఎదుర్కొంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీరేన్ సింగ్ సోమవారం అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గారు. 32మంది ఎమ్మెల్యేలు బీరేన్ సింగ్‌కు మద్దతు పలికారు. ఈ నెల 15న మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు గాను... కాంగ్రెస్‌కు 28, బీజేపీకి 21 స్థానాలు వచ్చాయి. నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్‌లు చెరో నాలుగు సీట్లు గెలుచుకున్నాయి. ఎల్‌జేపీ,టీఎంసీ చెరోక సీటు, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్, ఎల్‌జేపీ,టీఎంసీ మద్దతును కూడగట్టి... బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.