Manipur assembly
-
నయా ట్విస్ట్.. మణిపూర్ సీఎం రేసులో ఆరెస్సెస్ అభ్యర్థి!
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్‌ఇంకా కొనసాగుతూనే వస్తోంది. బీరెన్ సింగ్ నేతృత్వంలోనే పార్టీ ఘన విజయం సాధించడంతో ఆయన్నే మరో దఫా సీఎంగా కొనసాగించాలని కొందరు బీజేపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే వర్గ పోరు గనుక చెలరేగితే ప్రభుత్వ ఏర్పాటు అవకాశం గల్లంతు అవ్వొచ్చనే ఆందోళన నెలకొంది బీజేపీలో.. బీజేపీ మాత్రం సీఎం క్యాండిడేట్ ఎవరనే విషయంపై ఇంకా సస్పెన్స్ నడిపిస్తోంది. బీరెన్ సింగ్‌తో పాటు సీఎం పోస్టుకు బిస్వాజిత్ సింగ్ పేరును సైతం అధిష్టానం పరిశీలిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మూడో పేరు ముఖ్యమంత్రి రేసులో తెరపైకి వచ్చింది. ఆరెస్సెస్ బలపరుస్తున్న యుమ్నమ్ ఖేమ్‌చంద్ సింగ్ పేరు ఇప్పుడు ఈ లిస్ట్‌లో చేరింది. ఈ మేరకు ఖేమ్‌చంద్‌కు ఢిల్లీకి నుంచి శనివారం పిలుపు సైతం అందించింది. బీరెన్, బిస్వాజిత్ మధ్య పోటీని నివారించేందుకే మూడో అభ్యర్థి పేరును తెర మీదకు తీసుకొచ్చింది బీజేపీ. అంతేకాదు ఖేమ్‌చంద్‌కు ఆరెస్సెస్ మద్దతు ఇప్పుడు మణిపూర్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. నిన్నంతా బీరెన్, బిస్వాజిత్, ఖేమ్‌చంద్‌లతో విడివిడిగా బీజేపీ కీలక నేతలు సమావేశం అయ్యారు. ఆదివారం ఉదయం వాళ్లంతా తిరిగి మణిపూర్‌కు చేరుకోగా.. ఆ వెంటనే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరెన్ రిజ్జులు రాజధాని ఇంఫాల్‌కు క్యూ కట్టడం విశేషం. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌కు కాబోయే సీఎం ఎవరనేదానిపై జోరుగా చర్చ నడుస్తోంది. నిజానికి బిస్వాజిత్ సింగ్, బీరెన్ సింగ్ కంటే సీనియర్. పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు. 2017లోనే ఆయన సీఎం అవుతారని అంతా భావించారు. కానీ, అది జరగలేదు. మొత్తం 60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ తాజా ఎన్నికల్లో 32 సీట్లు గెల్చుకుని సుస్థిర ప్రభుత్వ ఏర్పాటునకు సిద్ధమైంది. ఈ తరుణంలో వర్గ పోరు పరిస్థితిని మార్చేయొచ్చన్న ఆందోళనలో అధిష్టానం ఉంది. అయితే తామంతా ఒకే తాటిపై ఉన్నామంటూ బిస్వాజిత్ సింగ్ ప్రకటన ఇవ్వడం కొసమెరుపు. ఇదిలా ఉండగా.. మణిపూర్ అసెంబ్లీ గడువు మార్చి 19వ తేదీతోనే ముగియగా.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ కొనసాగుతున్నారు. -
బలపరీక్షలో నెగ్గిన సీఎం బీరేన్ సింగ్
మణిపూర్: మణిపూర్‌లో కొత్తగా ఏర్పాటైన బీజేపీ సర్కార్ తొలి పరీక్షను విజయవంతంగా ఎదుర్కొంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీరేన్ సింగ్ సోమవారం అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గారు. 32మంది ఎమ్మెల్యేలు బీరేన్ సింగ్‌కు మద్దతు పలికారు. ఈ నెల 15న మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు గాను... కాంగ్రెస్‌కు 28, బీజేపీకి 21 స్థానాలు వచ్చాయి. నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్లు చెరో నాలుగు సీట్లు గెలుచుకున్నాయి. ఎల్జేపీ,టీఎంసీ చెరోక సీటు, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్, ఎల్జేపీ,టీఎంసీ మద్దతును కూడగట్టి... బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
గవర్నర్‌ను కలిసిన సీఎల్పీ నేత ఇబోబి సింగ్
మణిపుర్ : మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లాను సీఎల్పీ నేత ఓక్రమ్ ఇబోబి సింగ్ సోమవారం ఉదయం కలిశారు. తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయన ఈ సందర్భంగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా ఇప్పటికే బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేలంతా ఆదివారం రాత్రే గవర్నర్‌ను కలిశారు. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా.. తమకే ఎమ్మెల్యేల మద్ధతు ఉందని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ను బీజేపీ నేతలు కోరారు. అయితే మొత్తం అరవై నియోజవర్గాలకుగానూ కాంగ్రెస్ పార్టీ 28 కైవసం చేసుకోగా, బీజేపీ 21 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇక నాగా పీపుల్స్ ఫ్రంట్ 4, నేషనల్ పీపుల్స్ పార్టీ 4, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, లోక్ జనశక్తి పార్టీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో స్థానంలో నెగ్గారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31 మంది సీట్లు కావాలి. అయితే బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. '60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ బలం 32కు చేరింది. 11 మంది స్వతంత్ర సభ్యులు బీజేపీకి మద్దతు పలికారు' అంటూ గవర్నర్‌ను కలిసిన తర్వాత బీజేపీ నేత, అస్సాం మంత్రి హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కన్నా బీజేపీకి 7 సీట్లు తక్కువ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 31 సీట్ల కన్నా 10 సీట్ల వెనుకబాటు అయితేనేం మణిపూర్ గద్దెపై కాషాయ జెండా రెపరెపలాడబోతోంది.