సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయం ఈ ఉదయం కీలక మలుపు తిరిగింది. శివ సేన నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోవడం.. మహా వికాస్ అగాడి కూటమి ప్రభుత్వం నుంచి మద్ధతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఈ పరిణామాలను ఆసరాగా చేసుకుని బీజేపీ, మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారిని కలిసి ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని కోరింది. ఈ తరుణంలో..
మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, గవర్నర్‌ను కలిసి ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని నివేదించారు. ఈ మేరకు.. మహారాష్ట్ర గవర్నర్ బలనిరూపణకు సీఎం ఉద్దవ్‌థాక్రే ప్రభుత్వాన్ని బుధవారం ఆదేశించారు. గురువారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి.. అదే రోజు సాయంత్రంలోగా బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేకాదు.. సాయంత్రం ఐదు గంటల వరకే డెడ్‌లైన్ విధిస్తూ.. ఆ బలపరీక్షను రికార్డ్ చేయాలని ఆదేశించారాయన.
ఇదిలా ఉండగా బలనిరూపణ నేపథ్యంలో.. రేపు సాయంత్రం షిండే వర్గం గువాహతి నుంచి ముంబైకి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. బలనిరూపణ తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని షిండే ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.
సభలో మొత్తం సభ్యులు: 285/288 (శివసేన ఎమ్మెల్యేల్లో ఒకరు మరణించగా ఇద్దరు అరెస్టై జైల్లో ఉన్నారు)
మెజారిటీ మార్కు: 144
పాలక కూటమి వాస్తవ బలం: 168
షిండే తిరుగుబాటు తర్వాత: 119
షిండే కూటమిలోని ఎమ్మెల్యేలు: 49 మంది
బీజేపీ కూటమి వాస్తవ బలం: 113
షిండే కూటమి మద్దతిస్తే: 162
Comments
Please login to add a commentAdd a comment