తమిళనాడు ప్రజలు అమ్మను చూసి అన్నాడీఎంకేను గెలిపించారు... విశ్వాస తీర్మానంపై ఓటేసే ముందు ఒక్కసారి అమ్మను తలచుకోవాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. కుటుంబ పాలనకు జయలలిత పూర్తిగా వ్యతిరేకమని గుర్తుచేసుకోండి, రాష్ట్రాన్ని కుటుంబ పాలన నుంచి రక్షించండని విజ్ఞప్తి చేశారు.