తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బలపరీక్షపై ప్రతిపక్ష డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సహా, హోంసెక్రటరీ, అసెంబ్లీ స్పీకర్‌తో పాటు అసెంబ్లీ కార్యదర్శికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మార్చి 10లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయమూర్తులు జస్టిస్ జి.రమేష్, మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కాగా ఈ నెల 18న అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్ష సందర్భంగా శాసనసభ నియమాలను అనుసరించి జరగలేదని పేర్కొంటూ డీఎంకే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Published Mon, Feb 27 2017 4:13 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
Advertisement