
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం చివరి అంకానికి చేరింది. బలపరీక్షపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిసాయి. ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు.. బలపరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బలపరీక్షపై స్టే విధించేందుకు నిరాకరించిన ధర్మాసనం.. ఫ్లోర్ టెస్ట్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. దీంతో రేపు(గురువారం) ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీలో ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోనుంది.
చదవండి: నా వల్ల ఏమైనా తప్పు జరిగితే మన్నించండి: సీఎం ఉద్దవ్ భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment