పార్లమెంట్ ఆవరణలో వైఎస్ఆర్ సీపీ ఎంపీల ధర్నా | YSRCP MPs protests at gandhi statue in parliament due to AP special status | Sakshi
Sakshi News home page

పార్లమెంట్ ఆవరణలో వైఎస్ఆర్ సీపీ ఎంపీల ధర్నా

Published Thu, Dec 17 2015 11:44 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

YSRCP MPs protests at gandhi statue in parliament due to AP special status

న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని కేంద్రప్రభుత్వాన్ని లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.  గురువారం ఆయన ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 18 నెలలు అయింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం నీమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. అంతే కాకుండా  ఈ అంశాన్ని నీతి ఆయోగ్ కి అప్పగించినట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ప్రత్యేక హోదాపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ ఎంపీలు గురువారం ధర్నా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement