ఏపీ వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు | ysrcp protests all over andhrapradesh about special status | Sakshi
Sakshi News home page

ఏపీ వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు

Published Fri, Jan 27 2017 12:40 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఏపీ వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు - Sakshi

ఏపీ వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు

హైదరాబాద్‌: ప్రత్యేక హోదాపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్సీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా రాకుండా సైంధవుడిలా అడ్డుపడుతున్న చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని విమర్శించారు.

గురువారం కొవ్వొత్తుల ర్యాలీపై పాశవికంగా వ్యవహరించిన తీరుగానే.. శుక్రవారం నిరసన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో గుడివాడ అమర్‌నాథ్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్‌ సహా జానకీరామరాజు, గొర్లి సూరిబాబులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

► గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.
► అనంతపురం జిల్లా అధ్యక్షుడు శకంర్‌ నారాయణను సైతం పోలీసులు గృహ నిర్భంధం చేశారు.
► తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో భూమన కరుణాకర్‌ రెడ్డి,  ఎంపీ వరప్రసాద్‌ పాల్గొన్నారు.
► పులివెందులలో మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ర్యాలీలో పాల్గొన్న ఎంపీ అవినాష్‌రెడ్డి.
► రైల్వేకోడూరులో వైఎస్ఆర్‌ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అధ్వర్యంలో ధర్నా.
► ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్ల శివప్రాసద్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ.
► కృష్ణా జిల్లా నందిగామలో రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ్‌కుమార్ హౌస్‌ అరెస్ట్‌.
► శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ ఎమ్మెల్యే జగన్నాయకులు అరెస్ట్‌.
► ప్రకాశం జిల్లా దర్శిలో కాకర్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా.
► ఏలూరులో గుడిదేశి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో భారీ ధర్నా. ధర్నాలో పాల్గొన్న బొద్దాని శ్రీనివాస్‌, మైబాబు.
► తాడేపల్లిగూడెంలో మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ధర్నా.
► దెందులురులో కొఠారు రామచంద్రరావు ఆధ్వర్యంలో ధర్నా.
► చిత్తూరు నారాయణవనంలో కోనేటి ఆదిములం ఆధ్వర్యంలో రాస్తారోకో, ర్యాలీ.
► వరదయ్యపాల్యంలో దయాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన.
► విశాఖ జిల్లా చోడవరం సమన్వయకర్త కరణం ధర్మ ఆధ్వర్యంలో ధర్నా.
► మడుగుల ఎమ్మెల్యే బుడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో ధర్నా.
► పశ్చిమ గోదావరి చింతలపుడిలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ, నవీన్‌బాబు ఆధ్వర్యంలో నిరసన.
► రణస్థలంలో గొర్లు కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో నిరసన, అరెస్ట్‌.
► హిందుపురంలో నవీన్‌ నిచ్ఛెల్‌ హౌస్‌ అరెస్ట్‌. వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తల ధర్నా, అరెస్ట్‌.
► ఆలూరులో వీర్‌ విక్రాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా, ర్యాలీ.
► తిరువురులో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల మౌన ప్రదర్శన.
► కశింకోటలో ఎం. బుల్లిబాబు ఆధ్వర్యంలో రాస్తారోకో, అరెస్ట్‌.
► దర్శిలో బుచెపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా, ర్యాలీ.
► అవనిగడ్డ తహసీల్దార్‌ ఆఫీసు వద్ద సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో నిరసన.
► ఎమ్మిగనూరులో ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement