ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరసగా మూడో రోజు నిరసన పర్వం కొనసాగుతున్నాయి.
తూర్పుగోదావరి: ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు.
రాజమండ్రిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రైతు సూర్యప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు,
- ముమ్మడి వరం, పి.గన్నవరం, అనపర్తి, అమలాపురం, రాజోలు, మండపేట, రామచంద్రాపురం, రాజానగరం, జగ్గంపేటల్లో రిలేనిరాహార దీక్షలు, ధర్నాలు కొనసాగుతున్నాయి,
పశ్చిమ గోదావరి: పెదవేగిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
- కొవ్వూరులో వైఎస్సార్ సీపీ నేత తానేటి వనిత ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
- చింతల పూడి ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
- బుట్టాయిగూడెంలో ఎమ్మార్వో కార్యాలయం ముట్టడించారు.
చిత్తూరు: మదనపల్లె ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
- తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
నెల్లూరు: ప్రత్యేక హోదాకోసం ఉదయగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈ ర్యాలీకి నేతృత్వం వహించారు.
- మనబోలులో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
- గూడురు టవర్ క్లాక్ వద్ద వైఎస్సార్ సీపీ నేతల రిలే నిరాహార దీక్షలు, కార్యక్రమంలో పాల్గొన్న పాశం సునీల్ కుమార్
ప్రకాశం: చీరాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బాలాజీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
- కనిగిరి లో వైఎస్సార్ సీపీ నేత బుర్రా మదుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
- దర్శిలో మూడో రోజు నిరాహార దీక్ష కొనసాగుతోంది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
అనంతపురం: కదిరిలో ఎమ్మెల్యే చాంద్ బాషా ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
- రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆద్వర్యంలో వైఎస్సార్ సీపీ తహసీల్దార్ కార్యాలయం ముట్టడి నిర్వహించారు.
- తాడి పత్రిలో వీఆర్ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నేత రమేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మరో వైపు తాడిపత్రిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
విశాఖ:అనకాపల్లిలో వైఎస్సార్ సీపీ నేతలు మల్లా బుల్లిబాబు, జానకి రామరాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు.
శ్రీకాకుళం: ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. చెక్ పోస్టు ఆఫీసులో వినతి పత్రం సమర్పించారు.
టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
పలాసలో మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తంచేశారు.
కడప: ప్రత్యేక హోదా కోరుతూ బద్వేల్ తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే తిరువీధి జయరాములు పాల్గొన్నారు.
- ప్రత్యేక హోదా కోరుతూ రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
- రాజంపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి లేఖ ఇచ్చారు.
కర్నూలు: ప్రత్యేక హోదా కోరుతూ నంద్యాలలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
- ప్రత్యేక హోదా కోరుతూ కల్లూరులో వైఎస్సార్ సీపీ నేత గౌరు సరిత ఆధ్వర్యంలో నిలే నిరాహార దీక్షలు కొనసాగతున్నాయి.
- ఆలూరులో ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాములు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు
కృష్ణా : పెడన బస్టాండ్ సెంటర్ లో వైఎస్సార్ సీపీ నేత ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు, ఎమ్మార్వో కార్యాలయం ముట్టడించారు.
విజయనగరం: ప్రత్యేక హోదా కోరుతూ విజయనగరం జిల్లా కలెక్టరు కార్యాలయం నుంచి ఫూల్ బాగ్ కాలనీ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రామేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, ఏపీ నిరుద్యోగ సంఢం అధ్యక్షుడు గోవిందరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ , వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొటగట్ట వీరభద్రస్వామి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల ఆదిరాజు పాల్గొన్నారు.
- విజయనగరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.