అనంతపురం ఎడ్యుకేషన్ : రాఖీ పండుగ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థినులు గురువారం స్థానిక మునిసిపల్ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి రాఖీలు కట్టారు. అనంతరం విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కుమార్‌నాయుడు, రమేష్, బాలికల విభాగం కన్వీనర్ సుశీల మాట్లాడారు.స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా నేటికీ విద్యార్థినులు, మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినుల వసతి గృహాలకు ప్రత్యేక రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.