తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలని 108 ఉద్యోగులు డిమాండ్ చేశారు.
గాంధీ విగ్రహానికి 108 ఉద్యోగుల వినతిపత్రం
సంగారెడ్డి క్రైం : తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలని 108 ఉద్యోగులు డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా ఉద్యోగులు మంగళవారం జెడ్పీలోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ 108 సర్వీసులకు వంద శాతం నిధులు ప్రభుత్వమే చెల్లిస్తున్నందున ప్రభుత్వమే నిర్వహించాలని, కనీస వేతన చట్టం అమలు చేస్తూ రూ.20వేలు జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు.
పని గంటలు తగ్గించి, తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగుల సొంత జిల్లాలకు బదిలీ చేయాలని, ప్రమాదంలో చనిపోయిన వారికి ప్రభుత్వమే రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.