![Speaker Pocharam Srinivas Reddy Pays Tributes To Mahatma Gandhi - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/3/1T7A0660.jpg.webp?itok=wCOIF1be)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగుతోందని, ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం మనమందరం పునరంకితం కావాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వీజీ గౌడ్, తేరా చిన్నపరెడ్డి, కుర్మయ్యగారి నవీన్‌కుమార్, దయానంద్, శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ మహాత్మాగాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని గుర్తు చేశారు. గాంధీ ఆశయాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, గత ఏడేళ్ళలో రాష్ట్రం పరిపాలన పరంగా దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment