టీఆర్ఎస్లో చేరటం లేదు, అవన్ని పుకార్లే | Danam Nagender, sudeer reddy condemns to join trs | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్లో చేరటం లేదు, అవన్ని పుకార్లే

Published Thu, Jun 26 2014 2:24 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

టీఆర్ఎస్లో చేరటం లేదు, అవన్ని పుకార్లే - Sakshi

టీఆర్ఎస్లో చేరటం లేదు, అవన్ని పుకార్లే

హైదరాదాబాద్ : టీఆర్ఎస్లో  చేరుతున్నట్లు వస్తున్న కథనాలను మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఖండించారు. తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని వారు స్పష్టం చేశారు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వస్తున్న కథనాలు అవాస్తవాలని కొట్టిపారేశారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటామని, చచ్చినా, బతికినా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని దానం, సుధీర్ రెడ్డి తెలిపారు. వలసలను ప్రోత్సహించటం మంచిది కాదని వారు అభిప్రాయపడ్డారు.

 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే తమ ముందున్న బాధ్యత అని దానం, సుధీర్ రెడ్డి అన్నారు. ఇస్కాన్ దేవాలయం భూముల వ్యవహారంపై టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలుస్తామని దానం, సుధీర్ రెడ్డి తెలిపారు. కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement