
దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి అధికార పీఠం టీఆర్‌ఎస్ పార్టీయే కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ నమ్మకం వ్యక్తం చేశారు. సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తమ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడనున్న మహాకూటమికి ఘోర పరాభావం తప్పదని, తాజా సర్వేల్లో ఈ విషయం స్పష్టమైందని పేర్కొన్నారు. కుటంబ పాలనపై గొంతు చించుకుంటున్న టీపీసీసీ ఆధ్యక్షడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి దానం సవాల్ విసిరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి కుటుంబానికి ఒక్కరికే సీటు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. అలా చేస్తే సగం మీసం తీసేసి తిరుగుతానని ఉత్తమ్‌కు దానం చాలెంజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment