
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ సర్కార్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తుందని కాంగ్రెస్ నేతలు ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి శనివారం ఎస్‌ఈసీని కలిశారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రకటనల ఫ్లెక్సీలపై ఎస్‌ఈసీకి వారు ఫిర్యాదు చేశారు. మరో వైపు కాంగ్రెస్‌లో పలు అభ్యర్థిత్వాల ఖరారుపై అసంతృపి జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని స్థానాలకు తీవ్ర పోటీ నెలకొనడంతో వాటి అభ్యర్థిత్వాల ఖరారుపై ఇంకా తర్జన భర్జన కొనసాగుతూనే ఉంది. (చదవండి: పవన్ కళ్యాణ్‌పై బాల్కసుమన్ సెటైర్లు)
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఐదు విడతలుగా దాదాపు 116 డివిజన్లకు అభ్యర్థిత్వాలను ఖరారు చేసి జాబితా ప్రకటించింది. నామినేషన్ దాఖలు గడువు ముగిసినా మిగిలిన 34 స్థానాలకు అభ్యర్థిత్వ ఖరారును పెండింగ్‌లో పడేసింది. అయితే ఆ స్థానాలకు పోటీపడుతున్న ఆశవహులు మాత్రం నామినేషన్లను దాఖలు చేసినట్లు పార్టీ అధిష్టానవర్గంపై అన్ని విధాలుగా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. (చదవండి: జీహెచ్‌ఎంసీ : ఆ వదంతులు నమ్మకండి)
Comments
Please login to add a commentAdd a comment