
సాక్షి, ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని ముద్దనూరు రోడ్డులో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన చంద్ర అనే వ్యక్తిని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సుధీర్‌రెడ్డి తన సొంత కారులో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించారు. సోమవారం రాత్రి ట్యూషన్ నుంచి తమ పిల్లలను ఇంటికి తీసుకుని వెళుతుండగా ఎదురుగా మరో బైక్ రావడంతో రెండూ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ఆ మార్గంలో వెళుతున్న ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్‌రెడ్డి స్పందించి సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని తన సొంత కారులో ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment