Yerraguntla
-
CM YS Jagan Nandyal Bus Yatra: సమరోత్సాహం.. జన సముద్రంలా నంద్యాల.. (ఫొటోలు)
-
ఇవి మన భవిష్యత్తును మార్చే ఎన్నికలు అవ్వుతాయి: వైఎస్ జగన్
-
యర్రగుంట్ల గ్రామంలో సీఎం వైఎస్ జగన్ దృశ్యాలు
-
యర్రగుంట్ల చర్చ కార్యక్రమంలో సీఎం జగన్‌ను కలిసిన లబ్ధిదారులు (ఫొటోలు)
-
నా కొడుకు ప్రాణాలతో ఉన్నాడంటే కారణం మీరే అన్న..
-
లోకేష్ రెడ్ బుక్ కి గంగుల బ్రిజేంద్ర రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
ఈ టీచర్ మాటలకు సీఎం జగన్ ఫిదా
-
మీ ఇంట్లో చిన్న కొడుకు గా దీవించండి: వైఎస్ జగన్
-
సీఎం జగన్ ఎదురుగా... జగనన్నని ఇమిటేట్ చేసిన వికలాంగుడు
-
సీఎం వైఎస్ జగన్ గ్రాండ్ ఎంట్రీ
-
జనసంద్రంతో నిండిపోయిన యర్రగుంట్ల సభ
-
CM Jagan Bus Yatra Photos: ‘మేమంతా సిద్ధం’ రెండో రోజు బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్
-
ఈ చిన్నోడు చేసినంత ఆ ముసలాయన చేయలేకపోయాడు: సీఎం జగన్
సాక్షి, నంద్యాల: అక్కాచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం నింపేందుకు, పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు గత 58 నెలల కాలంలో తాను బటన్లు నొక్కి.. నేరుగా అకౌంట్లలో నగదు జమ చేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన ఆయన రెండో రోజైన గురువారం ఉదయం ఎర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘ఎక్కడా లంచాలు, ఎక్కడా వివక్ష లేవు. ఏ పార్టీ అని చూడకుండా.. అర్హత ఉంటే చాలూ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ప్రభుత్వ పథకాలతో కేవలం ఒక్క ఎర్రగుంట్లలోనే 93 శాతం మంది లబ్ధి పొందారు అని సీఎం జగన్ వివరించారు. ఈ సందర్భంగా.. వివిధ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని స్వయంగా ఆయన గణాంకాలతో వివరించారు. ఎర్రగుంట్లకు సంబంధించి.. అమ్మ ఒడి కింద ఒక్క ఎర్రగుంట్లలో 1,043 మంది తల్లులకు లబ్ధి చేకూరింది.. రూ. 4.69 కోట్లు అందించారు వైఎస్సార్ ఆసరా ద్వారా రూ. 3 కోట్లకు పైగా అందించారు ఎర్రగుంట్లలో ఆరోగ్యశ్రీ కింద రూ. 2 కోట్లకుపైగా అందించారు ఎర్రగుంట్లలో 1,496 ఇళ్లకుగానూ 1391 ఇళ్లకు లబ్ధి చేకూరింది ఎర్రగుంట్లలో చేదోడు కింద రూ. 31.20 లక్షలు అందించారు మొత్తంగా ఎర్రగుంట్లకు ఈ 58 నెలల కాలంలో రూ. 48.74 కోట్లు అందించారు ఎర్రగుంట్లలో 93.06 శాతం మందికి సంక్షేమం అందింది నా కంటే ముందు చాలామంది సీఎంలుగా చేశారు. నా కన్నా వయసు, అనుభవం ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రులుగా చేశారు. నా కంటే ముందు 75 ఏళ్ల వయసున్న ఓ ముసలాయన కూడా పరిపాలన చేశాడు. వయసులో నేను చాలా చిన్నోడిని. ఈ చిన్నోడిగా అడుగుతున్నా.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి అనుభవం మీ జీవితాలు మార్చిందా?. ఆలోచన చేయండి.. ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయండి అని సీఎం జగన్ ఎర్రగుంట్ల ప్రజలను కోరారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా గ్రామాలు బాగుపడ్డాయి. ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు నాడు-నేడుతో మారిపోయాయి. మీ బిడ్డ పాలనలో మార్పు ఏ స్థాయిలో జరిగిందో ఆలోచించండి. ఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు. మన భవిష్యత్తు కోసం ఓటేయాలి. జరిగిన మంచిని చూసి ఓటేయండి’’ అని సీఎం జగన్ ఎర్రగుంట్ల ప్రజల్ని కోరారు. 👉: ‘మేమంతా సిద్ధం’ రెండో రోజు బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్ (ఫొటోలు) -
ఎర్రగుంట్లలో సీఎం జగన్ క్రేజ్
-
సీఎం జగన్ రాకతో జనసంద్రంగా మారిన ఎర్రగుంట్ల
-
త్వరలోనే సౌరశక్తి రైలింజన్ కూత
రాజంపేట/జమ్మలమడుగు: జిల్లాలో రెండో రైలుమార్గంలో విద్యుద్దీకరణ పనులకు ఎట్టకేలకు రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. ఎర్రగుంట్ల–నంద్యాల రైల్వేలైన్ విద్యుద్దీకరణ (ట్రాక్షన్) పనులు ఇక ఊపందుకోనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే కేంద్రం పరిధిలోని సికింద్రాబాద్ స్టేషన్లో రైల్వేమంత్రి పియూష్ గోయల్ మంగళవారం ఈ పనులకు శంకుస్థాపన చేయడంతో జిల్లా ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోంది. దీర్ఘకాలిక స్వప్నం నెరవేరనుందని ఆశాభావంతో ఉంది. శంకుస్థాపన చేస్తూ తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సౌరవిద్యుత్ సెక్షనుగా ఈ మార్గాన్ని ప్రకటించారు. ఇప్పటివరకూ ఈమార్గంలో డీజిల్ లోకో రైళ్లు నడుస్తున్నాయి. డీఎంయూ (డీజల్ మల్టిపుల్ యూనిట్) ప్యాసింజర్ రైలు ఒకటి నడుస్తోంది. అదొక్కటే ఉపయోగకరంగా ఉంది. ధర్నవరం నుంచి అమరావతికి వారంలో రెండురోజులు ఈ ప్యాసింజర్ రైలును నడిపిస్తున్నారు. డీజల్ లోకో(రైలింజన్)తో గూడ్స్ రైళ్ల రాకపోకలను కొనసాగిస్తున్నారు. త్వరలోనే సౌరవిద్యుత్ సహాయంలో రైళ్లను నడపాలని రైల్వే అధికారులు సంకల్పిస్తున్నారు. రైలుమార్గం తీరు ఇలా.. కర్నూలు, కడప జిల్లాలను రాజధాని అమరావతికి అనుసంధానం చేసే ఈ రైలు మార్గం (ఎర్రగుంట్ల–నంద్యాల) 123 కిలోమీటర్ల విస్తరించి ఉంది. ఈ రూటులో ఇప్పటికే రూ.967కోట్లు వివిధ పనులకు వెచ్చించారు. 780హెక్టార్లు భూమిని ఈ మార్గం కోసం సేకరించారు. 139 ఆర్‌యూబీలు, కాపలా ఉన్నవి 5, లేనివి 15 ఎల్సీ గేట్లు ఉన్నాయి. 36 పెద్దవంతెనలు, 469 చిన్న వంతెనలున్నాయి. ఈ మార్గంలో ప్రొద్దుటూరు,జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం, సంజమల, కోయిలకుంట్ల, బనగానపల్లె, మద్దూరు స్టేషన్లు కవరవుతాయి. ఎర్రగుంట్ల–నంద్యాల రైల్వేలైన్ ట్రాక్షన్ పనులు గతేడాది జనవరిలో ప్రారంభిస్తారని భావించారు. బడ్జెట్లో నిధులు మంజూరయినా పనులను ప్రారంభించలేదు. రేణిగుంట–గుంతకల్ రైలుమార్గం విద్యుద్ధీకరణ అయినందున ఎర్రగుంట్ల నుంచి నంద్యాల రైల్వేలైన్ కూడా విద్యుద్దీకరణ పూర్తయితే ఎలక్ట్రికల్ ఇంజన్లతో రైళ్లు నడుస్తాయి. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే కడప..కర్నూలు జిల్లా ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరం. దక్షిణ మధ్య రైల్వేలో తొలి సౌర విద్యుత్ వినియోగ సెక్షనుగా దీనిని రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటివరకూ దక్షిణ మధ్య రైల్వేపరిధిలో సౌర విద్యుత్ సహాయంతో నడిచే రైలింజన్లు లేవు. అనుకున్న సమయంలో ఈ పనులు పూర్తి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. నిధులు స్వల్పమే.. ఎర్రగుంట్ల–నంద్యాల రైల్వేలైన్ విద్యుద్దీకరణకు కేంద్రం గత బడ్జెట్లో రూ.111.48 కోట్లు కేటాయించింది. ట్రాక్షన్ సర్వే పనులు కూడా నిర్వహించింది. ట్రాక్షన్ పనులను ఆర్వీఎన్ఎల్(రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్) సంస్థ చేపట్టనుంది. ఈఏడాది బడ్జెట్లో రూ.18కోట్లు కేటాయించింది. ఈమార్గం 123 కిలోమీటర్ల మేర రైలుమార్గంలో విద్యుద్దీకరణకు రూ.135 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కానీ కేంద్రం కేటాయించిన నిధులు స్వల్ప మేననే ఆవేదన వ్యక్తమవుతోంది. ఉత్త మాటలు కాకుండా నిధుల విడుదలలో కేంద్రం మరింత చొరవ చూపిస్తే ఈ మార్గంలో సౌరశక్తి సహాయంతో రైళ్ల కూత వినే అవకాశం ప్రయాణికులకు కలుగుతుంది. -
మానవత్వం చాటిన ఎమ్మెల్యే
సాక్షి, ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని ముద్దనూరు రోడ్డులో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన చంద్ర అనే వ్యక్తిని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సుధీర్‌రెడ్డి తన సొంత కారులో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించారు. సోమవారం రాత్రి ట్యూషన్ నుంచి తమ పిల్లలను ఇంటికి తీసుకుని వెళుతుండగా ఎదురుగా మరో బైక్ రావడంతో రెండూ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ఆ మార్గంలో వెళుతున్న ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్‌రెడ్డి స్పందించి సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని తన సొంత కారులో ఆస్పత్రికి తరలించారు. -
ముగ్గురిని బలిగొన్న బస్సు వేగం
సాక్షి, ఎర్రగుంట్ల(కడప) : సొంత ఊరిలోని భూములను చూసుకుని తిరిగి వస్తూ ఆ ముగ్గురూ మృత్యు ఒడికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతులందరూ కుటుంబ సభ్యులే. వివరాలివి. లక్ష్మిదేవి(45) , ఆమె భర్త వెంకట సుబ్బయ్య, ఈశ్వరమ్మ(65), అంజనమ్మ(35)లు వై. కోడూరుకు చెందిన వారు. ఉపాధి నిమిత్తం కడప సమీపాన చలమారెడ్డి పల్లెకు వచ్చేశారు. స్వస్థలమైన వై.కోడూరులో బంధువు మృతి చెందడంతో వీరంతా శనివారం చూసేందుకు వెళ్లారు. ఎలాగూ వచ్చామని పనిలో పనిగా గ్రామంలో తమకున్న కొద్దిపాటి స్థలాన్ని చూసుకున్నారు. ఈ లోగా చీకటిపడుతుండటంతో స్వగ్రామానికి బయలుదేరారు. కోడూరు గ్రామంలో ఒక సప్లయర్ ఆటోలో ఎక్కారు. ఆటోలో డ్రైవర్‌తో పాటు ఆరుగురు ఉన్నారు. ఎర్రగుంట్ల– వై కో డూరు గ్రామాల మధ్య వేంపల్లె మార్గంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు ఆటో చేరుకోగానే ఎర్రగుంట్ల నుంచి వేంపల్లెకు వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో అంజనమ్మ, లక్ష్మిదేవి, ఈశ్వరమ్మలు అక్కడికి అక్కడే మృతి చెందారు. వెంకటసుబ్బయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఆటో డ్రైవర్, మరో బాలుడు ప్రమాదం నుంచి బయటపడ్డారు. క్షతగాత్రుడు వెంకటసుబ్బయ్యను వెంటనే 108 వాహనంలో ప్రొద్దుటూరుకు తరలించారు. వెంకటసుబ్బయ్య దంపతులు, అంజనమ్మలు పొట్టకూటికి పదేళ్ల కిందటే కడప దగ్గర ఉండే చలామరెడ్డి పల్లెకు వచ్చేశారు. అక్కడే కూలి పనులు చేసుకుంటు బతుకుతున్నారు. లక్ష్మిదేవి మేనత్త ఈశ్వరమ్మ ఎర్రగుంట్ల పట్టణంలోనే నివాసం ఉంటోంది. ఈమె భర్త బాలసుబ్బయ్య గతంలోనే చనిపోయాడు. అనుకోని సంఘటన ముగ్గురి ప్రాణాలను బలిగొన్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. సంఘటన స్థలాన్ని ఎస్ఐ రుష్యేంద్రబాబు పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడ్డంతో వెంట వెంటనే తొలగింపు చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. బస్సు వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మూలె హర్షవర్థన్‌రెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. మృతుల వివరాలు తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ఘోర ప్రమాదం : ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ..!
సాక్షి, కడప : జిల్లాలోని ఎర్రగుంట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
జగనన్న పాలన సజావుగా సాగాలంటూ.. ఎమ్మెల్యే పాదయాత్ర
సాక్షి, ఎర్రగుంట్ల(కడప) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సుఖ సంతోషాలతో 20ఏళ్ల పాటు సాగాలని, నియోజకవర్గంలోని అన్ని మండలాలు సస్యశామలంగా ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం నిడుజివ్వి గ్రామం నుంచి తిరుమలకు ఆదివారం పాదయాత్ర చేపట్టారు. తొలుత ఆయన తల్లి మూలె లక్ష్మిదేవికి పాదాభివందనం చేశారు. పాదయాత్రలో రాష్ట్ర కార్యదర్శి మూలె హర్షవర్దన్‌రెడ్డి, వందలాది మంది నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. వైఎస్సార్ సీపీకి ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చారన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ పాలనలా జగన్ పాలన ఉంటుందన్నారు. జిల్లా ప్రజలందరూ సుఖంగా ఉండాలని కోరుకున్నారు. ఆర్థిక లోటు లేకుండా కష్టాలు రాకుండా రైతులకు మేలు జరగాలని, చెరువుల్లో నీరు నిండాలని ఆకాంక్షించారు. గండికోట నీటిని ఆరు మండలాల ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. పార్టీలకతీతంగా ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామన్నారు. బ్రాహ్మణీ స్టీల్ ప్లాంట్ వస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. 210 కిలోమీటర్ల పాదయాత్ర నిడుజివ్వి నుంచి కదిరివారిపల్లె, వలసపల్లె, తుమ్మలపల్లి, పెద్దనపాడు, ఉరుటూరు వీయన్ పల్లె , వేంపల్లి, గండి , రాయచోటి, పీలేరు మీదుగా పాదయాత్ర 210 కిలోమీటర్లు సాగనుంది. స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర సాగిన మార్గంలో ఉన్న ఆలయాల్లో ఎమ్మెల్యే పూజలు చేశారు. సీఐ కొండారెడ్డి ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముద్దనూరు మాజీ ఎంపీపీ మునిరాజరెడ్డి, మాజీ ఎంపీటీసీ సురేంద్రనాథ్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ వై విశ్వభార్గవరెడ్డి, నాయకులు వెంకటశివారెడ్డి, కౌన్సిలర్లు డి.సూర్యనారాయణరెడ్డి, పద్మనాభయ్య, మల్లు గోపాల్‌రెడ్డి, డి గంగాక్రిష్ణారెడ్డి, జయరామక్రిష్ణారెడ్డి, హనుమంతురెడ్డి, ముద్దనూరు కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి, ఎర్రంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎంపీటీసీ వరధారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు రషీద్, కోకోకోల గౌస్ చిన్నషేట్, మైనార్టీ నాయకులు ఇస్మాయిల్, అబ్దుల్ గఫూర్, వలి తదితరులు పాల్గొన్నారు. -
బస్సులో సీటు లేదన్నందుకు..
వైఎస్ఆర్ జిల్లా , ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు అద్దాలు పగలకొట్టి హల్చల్ చేసిన శివశంకర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సు కండక్టర్ గంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఎర్రగుంట్ల ఆర్టీసీ బస్టాండ్‌కు ప్రొద్దుటూరు నుంచి వేంపల్లికు వెళ్లే బస్సు వచ్చి ఆగింది. ఆ బస్సులో ప్రయాణికులు ఫుల్‌గా ఉండటంతో కూర్చోడానికి స్థలం కూడా లేదు. అయితే అదే సమయంలో అయ్యవారిపల్లెకు వెళ్లేందుకు శివశంకర్ అనే వ్యక్తి బస్సు ఎక్కబోయాడు. స్థలం లేదని కండక్టర్ గంగమ్మ చెప్పారు. దీంతో శివశంకర్ కోపంగా బస్సు అద్దాలపై రాయితో బలంగా కొట్టాడు. అంతే అద్దాలు పగలిపోయి ముక్కలు బస్సులో ఉన్న ప్రయాణికుడు నారాయణరెడ్డి తలకు తగిలి రక్తగాయాలయ్యాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. -
ఎర్రగుంట్ల బస్టాండ్.. చోరీలకు కేరాఫ్
వైఎస్ఆర్ జిల్లా, ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల ఆర్టీసీ బస్టాండ్ చోరీలకు నిలయంగా మారిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ బస్సులు ఎక్కాలంటేనే ఏ బ్యాగులో నుంచి ఏ వస్తువు చోరీ చేస్తారో.. ఎవరి జేబులో నుంచి ఎంత నగదు మాయమవుతుందో.. ఎవరి పర్సు కొట్టేస్తారో.. అనే భయం ప్రయాణికులను వెంటాడుతోంది. ఆర్టీసీ బస్టాండ్‌లో సీసీ కెమెరాలు ఉన్నా దొంగలు మాత్రం హస్త లాఘవం ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇక్కడ సెల్ ఫోన్లు, బంగారు , డబ్బులు చోరీ కావడం నిత్యకృత్యమైంది. బుధవారం ఏకంగా ఓ వ్యక్తి నిక్కరు జేబును బ్లేడ్‌తో కోసి రూ.2 లక్షలు నగదు దొంగిలించిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు బస్టాండ్‌లో బస్సులు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు పెరిగిపోవడమే గాని చోరీల నియంత్రణకు పోలీసులు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. నిఘా కెమెరాలు ఉన్నా లేనట్టే.. ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులు నిఘా కెమెరాలను ఏర్పాటు చేసినా వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలుస్తోంది. ఈ కెమెరాలు ఉన్న డైరెక్షన్లో చెట్లు అడ్డంగా ఉండడంతో చోరీ జరిగిన సంఘటనలు అందులో నమోదు కాలేకపోతున్నాయి. ఒక వేళ నమోదయినా దొంగలు సరి గా కన్పించడంలేదు. అంతేకాక బస్సులు కూడా నిఘా కెమెరాలకు అడ్డంగా వస్తుండడంతో ప్రయాణికులు బస్సు ఎక్కే దృశ్యాలు నమోదు కాలేక పోతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు స్పందించి బస్టాండులో నిఘా ఏర్పాటు చేసి అ నుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకుని చోరీలను నివారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో ఉద్రిక్తత
ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి తనపై అత్యాచారయత్నం చేశాడంటూ పారిశుద్ధ్య కార్మికురాలు చేసిన ఫిర్యాదుతో వివిధ రాజకీయ పా ర్టీలు, కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. కమి షనర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఎట్టకేలకు పోలీసులు కమిషనర్‌పై ఎస్సీ,ఎస్టీ కేసు, అత్యాచార యత్నం కేసు నమోదు చేశారు. ఎర్రగుంట్ల (వైఎస్సార్ కడప): ఎర్రగుంట్ల మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తనపై కమిషనర్ విజయసింహారెడ్డి అత్యాచారానికి ప్రయత్నించారని పారిశుద్ధ్య కార్మికురాలు ఎస్.వసంత వాపోయింది. ఆమెకు న్యాయం చేయాలని తోటి కార్మికులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రగుంట్ల మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా ఎస్.వసంత పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు కమిషనర్ ఇంటి వద్ద పని చేయడానికి మేస్త్రీ అయిన నర్సింహరెడ్డి ద్వారా పిలవడం జరిగింది. దీంతో కమిషనర్ ఇంటి వద్దకు ఆమె వెళ్లింది. ఇల్లు శుభ్రం చేసిన తర్వాత.. బెడ్ రూమ్‌లో శుభ్రం చేస్తుండగా కమిషనర్ వెనుక నుంచి వచ్చి పట్టుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘నేను చెప్పినట్టు వింటే నీకు ఏమి కావాలన్నా ఇస్తాను’ అని లొంగదీసుకోవడానికి బలవంతంగా లాగారని వాపోయింది. తాను గట్టిగా కమిషనర్‌ను వెనక్కి నెట్టి పరుగెత్తుకుంటూ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి తోటి కార్మికులకు జరిగిన విషయం తెలిపానని వివరించింది. మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయింపు మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో ఈ విషయం మాట్లాడటానికి కార్మికులు ప్రయత్నించారు. అయితే అధికారులు బెదగొట్టే ధోరణితో వ్యవహరించారు. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఎం.హర్షవర్ధన్‌రెడ్డి, కౌన్సిలర్లు డి.సూర్యానారాయణరెడ్డి, పద్మనాభయ్య, నాగన్న, కడప పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి జయరామక్రిష్ణరెడ్డి, వర్రా డెవిడ్, నాయకులు దివాకర్‌రెడ్డి, షర్పుద్దీన్, మహుబూబ్వలి, బీజేపీ నాయకుడు నాగరాజు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.గంగిరెడ్డి, సీపీఐ జిల్లా నాయకులు ఎస్.మంజుల, ఏఐటీయూసీ నాయకులు ఎం.నారాయణ అక్కడికి చేరుకున్నారు. కార్మికులతోపాటు వారు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అంతకుమునుపు బాధితురాలికి మద్దతుగా మున్సిపల్ చైర్మన్ ముసలయ్య నిలిచారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కమిషనర్‌ను ప్రత్యేక వాహనంలో కార్యాలయం నుంచి బయటకు పంపించారు. విషయం తెలుసుకున్న కార్మికులు రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో రోడ్డుపై బైఠాయించారు. తర్వాత పోలీసులు కమిషనర్‌ను పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎస్ఐలు మారెన్న, చిరంజీవి, క్రిష్ణయ్య, మహమ్మద్ రఫీలు ఆందోళనను అదుపు చేశారు. ఆందోళనకారులు బాధితురాలు వసంతతోపాటు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కమిషనర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 354–ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మారెన్న తెలిపారు. డీఎస్పీ విచారణ కడప డీఎస్పీ మాసూంబాషా ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌కు వచ్చి విచారణ చేపట్టారు. బాధితురాలికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ నేత హర్షవర్ధన్‌రెడ్డి, సీ పీఐ నాయకురాలు మంజుల డీఎస్పీని కలిసి కోరారు. కమిషనర్ ఏమంటున్నారంటే.. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ విజయసిం హారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా.. తనపై నిందా ఆరోపణలు వేస్తున్నారన్నారు. మున్సిపల్ కౌన్సిల్ స మావేశంలో జీఓ 279ను ఆమోదం చేయాలని అజెం డాలో పొందుపరచడం జరిగిందని చెప్పారు. ఈ జీ వో అమలులోకి వస్తే ఉద్యోగ భద్రత ఉండదని నెపం తో కార్మికులు తన పైన నిందలు వేస్తున్నారని చెప్పా రు. తాను కార్మికులను బలవంతం చేయలేదన్నారు. కమిషనర్ బదిలీ ఎర్రగుంట్ల మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. తనను బదిలీ చేయాలని ఆయన రెండు వారాల క్రితం ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. -
జన్మభూమి సభలో ఏపీ మంత్రికి షాక్
-
ప్రతీ హామీ నెరవేర్చాకే ఓట్లు అడుగుతాం
-
పేదలకు రోగాన్ని బట్టి పదివేలు పెన్షల్ ఇస్తాం
-
నేడు ఎర్రగుంట్లలో ప్రజాసంకల్పయాత్ర
ఎర్రగుంట్ల: ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర గురువారం ఉదయం ఎర్రగుంట్ల మండలంలోకి ప్రవేశించనున్నట్లు వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఎం. సుధీర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఎర్రగుంట్లలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. గురువారం ఉదయం సర్వరాజపేట నుంచి ప్రజా సంకల్పయాత్ర మండలంలో ప్రవేశి స్తుందన్నారు. సర్వరాజపేటలో ప్రారంభమై పెద్దనపాడుకు చేరుకుంటుందని, అక్కడ కార్యకర్తలతో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మర్తల సాంబశివారెడ్డితో పాటు మరి కొందరు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. వై కోడూరు గ్రామ సమీపంలోని దేవాలయంలో వైఎస్ జగన్ పూజలు చేస్తారని తెలిపారు. తరువాత గ్రామ క్రాస్ రోడ్డు, జువారి క్రాస్ రోడ్డు వద్ద సమావేశం, మధ్యాహ్నం వేంపల్లి రోడ్డులోని జయశంకర్‌రెడ్డి పెట్రోల్ బంకు వద్ద భోజనం చేస్తారని తెలిపారు. 2.30 గంటలకు ఎర్రగుంట్లలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద బహిరంగ సభతో పాటు జెండా ఆవిష్కరణ ఉంటుందన్నారు. తరువాత బ్రిడ్జి మీదుగా మెయిన్ బజార్ వరకు పాదయాత్ర సాగుతుందని తెలిపారు. అక్కడి శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరీ దేవి ఆలయంలో పూజలు చేస్తారని వివరించారు. తరువాత రాణివనం, ప్రకాశ్‌నగర్ కాలనీల మీదుగా బైపాస్‌రోడ్డు వరకు పాదయాత సాగుతుందన్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొనాలని ఆయన కోరారు. పార్టీ జిల్లా కార్యదర్శి జయరామకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు డి. వెంకటశివారెడ్డి, రైల్వే కాంట్రాక్టర్ వెంకట్రామిరెడ్డి, రామచంద్రారెడ్డి, ఎరికల్‌రెడ్డి, రామశేఖర్‌రెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, యూసోఫ్ ఇల్లూరు వెంకటసుబ్బారెడ్డిలు పాల్గొన్నారు. -
గనుల్లో నీరు..కార్మికులకు కన్నీరు
ఎర్రగుంట్ల: దేశ, విదేశాలలో కడప నాపరాయికి అధిక డిమాండ్ ఉంటోంది. జిల్లాలో ఎర్రగుంట్ల పరిధిలో నాపరాళ్ల పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల భారీగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో గనులలో నీరు నిలిచింది. దీంతో పనులు నిలిచిపోయాయి. వీటిపై ఆధారపడ్డ కార్మికులు ఉపాధి కోల్పోయారు. నాపరాయి గనులకు నిడుజివ్వి గ్రామం నిలయం. ఈ గ్రామ పరిధిలోనే దాదాపు ఎక్కువ గనులు ఉన్నాయి. గనుల్లో దాదాపు 40 అడుగుల లోపలి నుంచి రాళ్లను బయటకు తీస్తారు. ఈ రాళ్లపైనే ఆధారపడి పాలీష్ మిషన్లు నడస్తున్నాయి. మునిగిన మిషన్లు నాపరాయి పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. 150 దాకా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో సుమారు 50 మూత పడ్డాయి. నీటిలోనే రాళ్లు, కోత మిషన్లు మునిగిపోయాయి. దీంతో అవి దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. నీటిని తోడేసే పనిలో యజమానులు నిమగ్నమయ్యారు. తోడేసినా.. ఊట ద్వారా నీరు మళ్లీ చేరుతోంది. రాళ్ల మధ్య నుంచి నీరు అధికంగా ఊరుతోంది. దీంతో గనుల నుంచి నీరు తొలగడం లేదు. దాదాపు రెండు వారాలుగా పరిశ్రమల్లో పనులు ఆగిపోయాయి. దీంతో కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. రోజూ పనికి వెళ్తేనే వీరికి పూట గడిచేది. ఈ నేపథ్యంలో అప్పులు చేసి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఎర్రగుంట్లలో టీడీపీ దాష్టీకం.. ఉద్రిక్తత
-
ఎర్రగుంట్లలో టీడీపీ దాష్టీకం.. ఉద్రిక్తత
వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌ను ఎమ్మెల్యే ఆది తీసుకెళుతుండగా తిరగబడిన జనం ఎర్రగుంట్ల (వైఎస్సార్ జిల్లా): ఎర్రగుంట్లలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు దాడిచేయడంతో పట్టణంలో ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. తెలుగుదేశం కార్యకర్తల దౌర్జన్యానికి నిరసనగా వేలాదిమంది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు...వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి పార్టీ ఫిరాయించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన అనుచరులతో సోమవారం ఉదయం ఎర్రగుంట్లకు వచ్చి వైఎస్సార్సీపీకి చెందిన 17వ వార్డు కౌన్సిలర్ దివ్య, ఆమె తండ్రి ఎరికలరెడ్డిని వెంట తీసుకుని వెళుతుండగా దివ్యను ప్రజలు నిలదీశారు. వైఎస్సార్సీపీ తరపున నిలబడిన నీకు మేము ఓటువేసి గెలిపిస్తే ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్లడం ఎంతవరకు సమంజసమని సుబ్బారెడ్డి అనే వ్యక్తి ప్రశ్నించాడు. పార్టీఫిరాయించేందుకు వీలులేదని ఆ వార్డు ప్రజలు అడ్డుకున్నారు. దాంతో కాస్త ఘర్షణ జరిగింది. ప్రజలు అడ్డుకోవడంతో ఆదినారాయణరెడ్డి వర్గం వెనక్కివెళ్ళిపోయింది. కాసేపటి తరువాత వచ్చిన టీడీపీ కార్యకర్తలు మమ్మల్నే ఎదురు ప్రశ్నిస్తావా అంటూ సుబ్బారెడ్డిపై దాడిచేశారు. దాంతో సుబ్బారెడ్డి ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై, ఆయన అనుచరులపై ఫిర్యాదుచేశారు. ఇదే సందర్బంగా జమ్మలమడుగు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సుధీర్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి సుబ్బారెడ్డికి అండగా నిలిచారు. తమపై కేసు పెట్టేందుకు సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడని తెలుసుకున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కోపంగా స్టేషన్‌కు వచ్చారు. అక్కడ సుధీర్‌రెడ్డికి, ఆదినారాయణరెడ్డికి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్ వెలుపల వేలాదిమంది జనం గుమిగూడారు. దాంతో లో ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. విషయం తెలిసిన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి హుటాహుటినఎర్రగుంట్లకు చేరుకుని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడిచేసిన టీడీపీ కార్యకర్తలను అరెస్టుచేయాలని పోలీస్‌స్టేషన్‌లో బైఠాయించారు. -
లారీపై నుంచి జారి పడి డ్రైవర్ దుర్మరణం
ఎర్రగుంట్ల: మండల పరిధిలోని తిప్పలూరు గ్రామ సమీపంలో ఉన్న ల్యాంకో క్వారీ వద్ద లారీపై నుంచి జారి పడి డ్రైవర్ మహబూబ్‌బాషా(46) దుర్మరణం చెందాడు. సంఘటన çస్థలాన్ని ఎస్ఐ వెంకటనాయుడు పరిశీలించారు. ఆయన కథనం మేరకు ఎర్రగుంట్ల పట్టణంలోని రాణివనం కాలనీకి చెందిన మహబూబ్‌బాషా లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తిప్పలూరు సమీపంలోని ల్యాంకో క్వారీ నుంచి లోడును శ్రీకాళహస్తికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. లారీపైన పట్టను సరిచేస్తున్న సమయంలో కింద ఉన్న మరో డ్రైవర్ లారీని కదిలించగా జారి కింద పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్యా పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డిలు సంఘటన స్థలాన్ని సందర్శించి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
కదిరివారిపల్లెలో జ్వరంతో చిన్నారి మృతి
ఎర్రగుంట్ల: మండల పరిధిలోని కదిరివారిపల్లెకు చెందిన సింధూరి (2) అనే చిన్నారి రక్తకణాలు తగ్గి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కదిరివారిపల్లెకు చెందిన రాజ, తబితల కుమార్తె సింధూరి. కొన్ని రోజుల జ్వరం రావడంతో ప్రొద్దుటూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. తర్వాత డెంగీ వచ్చినట్లు, కర్నూల్‌కు వెళ్లాని వైద్యులు సూచించారు. దీంతో హుటాహుటిన కర్నూల్‌కు తీసుకెళ్లారు. అక్కడ రక్తకణాలు 30 వేలకు పడిపోయి చిన్నారి సుంధూరి మృతి చెందిన తల్లిదండ్రులు వాపోయారు. స్థానిక వైద్యాధికారి సాంబశివారెడ్డి వైద్య రిపోర్టులను పరిశీలించారు. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో మృతి చెందినట్లు తెలిపారు. డెంగీ లక్షణాలు లేవన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఎం. సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్ మైసురారెడ్డి తనయుడు రఘుకార్తీక్‌రెడ్డిలు గ్రామానికి పోయి పరామర్శించారు. -
కాటేసిన కరెంటు తీగ..
విద్యుదాఘాతంతో రైతు మృతి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణం గుండెలవిసేలా రోదించిన కుటుంబ సభ్యులు ఓ రైతు తమ కూలీతో కలిసి మోటారు సైకిల్‌పై ఇంటికి వెళ్తున్నాడు... కిందికి వాలి ఉన్న విద్యుత్ తీగలు తెగి ఆ రైతు గొంతుకు తగులుకున్నాయి... అంతే బైక్ అదుపు తప్పింది... వెనుక కూర్చున్న కూలీ ఎగిరి కింద పడ్డాడు... రైతు మంటల్లో కాలిపోయి దుర్మరణం చెందాడు... కూలీ గాయాలతో బయటపడ్డాడు... సంఘటన స్థలానికి పరుగున వచ్చిన కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు... ఈ సంఘటనకు కారణం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేనని, వారిపై చర్యలు తీసుకోవాలని బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు... బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు. ఎర్రగుంట్ల: మండల పరిధిలోని వలసపల్లికి చెందిన రైతు జంగ గంగాధర్‌రెడ్డి(50) సోమవారం కరెంటు తీగలు తగిలి దుర్మరణం చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆయన తమ ఉమ్మడి పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు. భార్య వసుందరమ్మతోపాటు ఇద్దరు సంతానం ఉన్నారు. తనకు ఉన్న పొలంలో చీనీ మొక్కలు నాటి, వరి పంట సాగు చేశారు. రోజూ ఉదయాన్నే కూలీలను పిలుచుకొని వెళ్లి వ్యవసాయ పనులు చేయిస్తుంటారు. ఈ క్రమంలో భాగంగా సోమవారం ట్రాక్టర్లో కూలీలను పిల్చుకొని పొలానికి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఇంటికి వెళ్లి భోజనం చేసి వస్తానని తన అన్న వెంకట్రామిరెడ్డితో చెప్పి.. మరో కూలి రామాంజనేయులుతో కలిసి టార్ సైకిల్‌పై బయలు దేరారు. రోజూ వెళ్లే దారిలోనే వారు వెళ్తున్నారు. పొలం దాటి వెళ్తుండగా కిందికి వాలి ఉన్న 11 కేవీ విద్యుత్ తీగ తెగి వచ్చి.. గంగాధర్‌రెడ్డి గొంతుకు తగులుకుంది. దీంతో బైక్ అదుపుతప్పింది. అంతే వెనుకు కూర్చొని ఉన్న రామాంజనేయులు ఎగిరి కింద పడ్డారు. ఆ క్షణంలోనే మంటలు వ్యాపించి గంగాధర్‌రెడ్డి కాలిపోయి అక్కడికి అక్కడే మృతి చెందాడు. స్కూటర్ కూడా కాలిపోయింది. అన్న వచ్చి విద్యుత్ తీగ తొలగించినా... కింద పడ్డ రామాంజనేయులు కేకలు వేసుకుంటూ పొలంలోకి పరుగు తీసి విషయాన్ని తెలిపారు. దీంతో పొలంలో ఉన్న అన్న వెంకట్రామిరెడ్డి పరుగు తీసుకుంటూ వచ్చి విద్యుత్ తీగను కర్రతో తొలగించారు. అప్పటికే గంగాధర్‌రెడ్డి చనిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. గాయాల పాలైన రామాంజనేయులును చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తలించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ వెంకటనాయుడు పరిశీలించారు. వెంకట్రామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఈఎస్ఐ ఆస్పత్రిలో వృద్ధుడు మృతి
–వైద్యాధికారి లేకపోవడం వల్లే మృతి చెందాడంటూ వాదనకు దిగిన కార్మికులు – సీరియస్ అయితే నేరుగా పెద్దాసుపత్రికి వెళ్లొచ్చన్న వైద్యాధికారి ఎర్రగుంట్ల: ఎర్రగుంట్లలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో చిలంకూరుకు చెందిన వృద్ధుడు ఎన్. శేషయ్య(68) గురువారం మృతి చెందాడు. సకాలంలో వైద్యా«ధికారి ఆస్పత్రికి రాకపోవడంతోనే చికిత్స అందక తన తండ్రి మృతి చెందాడని మృతుడి కుమారుడు శ్రీనివాసులు వాపోయాడు. కార్మికులు , స్థానికుల కథనం మేరకు .. చిలంకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఆర్టీపీపీలోని మెయింటెనెన్స్ విభాగంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఈఎస్ఐ కార్డు ఉంది. ఇతని తండ్రి శేషయ్యకు జ్వరం రావడంతో గురువారం తన భార్య మునిలక్ష్మితో కలసి చిలంకూరు నుంచి ఆటోలో ఎర్రగుంట్లలో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రికి వెళ్లాడు. అప్పటికి అక్కడ వైద్యా«ధికారి లేడు. సిబ్బంది కూడా పట్టించుకోలేదు. కొద్ది సేపటికే శేషయ్య మృతి చెందాడు. తరువాత వైద్యాధికారి విష్టు వర్ధన్‌రెడ్డి రావడంతో అక్కడే ఉన్న కార్మికులు ‘మీరు ఆలస్యంగా రావడంతోనే శేషయ్య మృతి చెందాడని వాదనకు దిగారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ఈఎస్ఐ కార్డులు ఉన్న వారు సీరియస్ అయితే వెంటనే నేరుగా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లొచ్చన్నారు. ఇక్కడ అత్యవసర మందులు లేవని తెలిపారు. ఎస్ఐ వెంకటనాయుడు ఆస్పత్రి వద్దకు వచ్చి జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. చివరకు మృతుడి బంధువులు మృతదేహాన్ని చిలంకూరు గ్రామానికి తీసుకెళ్లారు. -
కలమల్లలో టీడీపీ వర్గీయుల దౌర్జన్యం
– వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సుందరమ్మ కుటుంబ సభ్యులపై దాడి –ప్రాణ భయంతో సుధీర్‌రెడ్డి ఇంటికి చేరిన సుందరమ్మ, భర్త రమేష్ –టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఒత్తిడి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు ఎర్రగుంట్ల: అధికార దాహంతో.. ఎలాగైనా శాసన మండలి ఎన్నికల్లో గెలవాలని.. ఇందుకోసం ప్రత్యర్థులను బెదిరించి, భయపెట్టి ఓట్లను పొందాలని టీడీపీ వర్గీయులు కుయుక్తులు పన్నుతున్నారు. ఇందుకు నిదర్శనం ఆదివారం రాత్రి కలమల్లలోని కృష్ణానగర్‌లో చోటుచేసుకున్న ఘటనే. టీడీపీ వర్గీయులైన వెంకటేష్, కృష్ణయ్య తమ కుటుంబ సభ్యులపై దాడి చేశారని వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలైన సుందరమ్మ, ఆమె భర్త రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీలోకి రావాలంటూ ఒత్తిడి ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యురాలు సుందరమ్మ, ఆమె భర్త రమేష్ మాట్లాడుతూ కలమల్లలోని కలమల్ల–3 ఎంపీటీసీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్పారు. అయితే శాసన మండలి ఎన్నికలలో టీడీపీకి అనుకూలంగా ఉండాలని గ్రామానికి చెందిన వెంకటేసు, కృష్ణయ్య ఒత్తిడి చేస్తున్నారని వారు వాపోయారు. తాము వైఎస్సార్సీపీని వీడి టీడీపీలోకి వచ్చే ప్రసక్తే లేదని తెలిపినట్లు చెప్పారు. దీంతో ఆదివారం రాత్రి పదే పదే ఫోన్ చేసి చేసి బెదిరించినట్లు తెలిపారు. అలాగే తమ అత్తమామలైన సుందరమ్మ, రామాంజనేయులు, ఆడబిడ్డ వాణిపై దాడి చేసి బెదిరించారని ఎంపీటీసీ సభ్యురాలు తెలిపారు. దీంతో ప్రాణ భయంతో వైఎస్సార్సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డికి తెలియజేయడంతో.. ఆయన వెంటనే స్పందించి తమకు భరోసా ఇచ్చారని వారు పేర్కొన్నారు. అదే రాత్రి భయంతో వారు నిడుజివ్వి గ్రామంలోని ఎం.సుధీర్‌రెడ్డి ఇంటికి వచ్చినట్లు తెలిపారు. రక్షణ కల్పించాలి ఈ విషయం తెలుసుకున్న కలమల్ల ఎస్ఐ రవికుమార్ నిడుజివ్వికి వచ్చి ఎంపీటీసీ సభ్యురాలైన సుందరమ్మ, ఆమె భర్త రమేష్‌తో మాట్లాడారు. గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు వెంకటేసు, కృష్ణయ్య తమ కుటుంబ సభ్యులను బెదిరించి దాడికి దిగారని ఫిర్యాదులో పేర్కొన్కారు. వీరతో ప్రాణ భయం ఉందని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఎస్ఐ వివరణ ఈ విషయంపై కలమల్ల ఎస్ఐ రవికుమార్ వివరణ కోరగా.. ఎంపీటీసీ సభ్యురాలు సుందరమ్మ, ఆమె భర్త రమేష్ తమ కుటుంబ సభ్యులపై టీడీపీ వర్గీయులైన వెంకటేసు, కృష్ణయ్య దాడికి తిగినట్లు ఫిర్యాదు చేశారని చెప్పారు. అయితే అలాగే ఎంపీటీసీ సభ్యురాలు సుందరమ్మ అత్త మామ, ఆడబిడ్డలను విచారణ చేయగా.. వారు తమపై ఎవరూ దాడి చేయలేదని ఫిర్యాదు చేశారని ఎస్ఐ పేర్కొన్నారు. ఇరువురు ఇచ్చిన ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినట్లు చెప్పారు. విచారణ చేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వివరించారు. -
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
ముద్దనూరు: ముద్దనూరు–మంగపట్నం రైల్వే రహదారిలో చింతకుంట గ్రామ సమీపంలో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మరణించాడు. ఆయనకు 25–30 ఏళ్ల మధ్య వయసు వుంటుందని, గోధుమరంగు చొక్కా, గళ్ళ లుంగీ ధరించాడని ఎర్రగుంట్ల రైల్వే ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఇతర ఆనవాళ్లు ఏమీ లభించలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. మృతుడు పరిసర గ్రామాలకు చెందని వ్యక్తిౖయె ఉండవచ్చని స్థానికులు తెలిపారు. -
అందని సర్టిఫికెట్లు..తప్పని ఇక్కట్లు
ఎర్రగుంట్ల: ఐటీఐ కళాశాలలో 2014–15 విద్య సంవత్సరానికి సంబంధించి ఐటీఐ డీజిల్ కోర్సు పాసైన విద్యార్థులు సర్టిఫికెట్లు రాక అవస్థలు పడుతున్నారు. అధికారులు చేసిన తప్పిదం వల్ల ఎర్రగుంట్ల ఐటీఐ కళాశాలకు రావాల్సిన సర్టిఫికెట్లు చిత్తూరు జిల్లాలోని విజయపురి కళాశాలకు వెళ్లాయి. ఎర్రగుంట్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ ఏడాది జనవరిలో డీజిల్ కోర్సు పరీక్షలు నిర్వహించారు. ఇందులో 15 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంత వరకు సర్టిఫికెట్లు రాకపోవడంతో విద్యార్థులు ఏ కంపెనీ లో ఉద్యోగంలో చేరలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఆరా తీస్తే ప్రభుత్వ అధికారులు ఆన్లైన్లో ఎర్రగుంట్లకు చెందిన సర్టిఫికెట్లపై చిత్తూరు జిల్లాలోని విజయపురి అని పెట్టడడం వల్ల అక్కడికి పోయాయి.ఈ విషయం ఏవరికి తెలియదు. అయితే కళాశాలకు సీ ఫాం రావడం వల్ల సర్టిఫికెట్లు విజయపురికి పోయినట్లు గుర్తించారు. వెంటనే స్థానిక ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ విషయాన్ని బోర్డు ఉన్నతాధికారులకు తెలియజేశారు. అధికారులు చేసిన తప్పిదం బయటకు తెలియజేయకుండా ర హస్యంగా ఉంచారు. త్వరగా వస్తాయంటూ నమ్మిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆర్టీపీపీపై కుట్రను అడ్డుకోండి
ఎర్రగుంట్ల: రాయలసీమకు వెలుగునిచ్చే ఆర్టీపీపీని తాకట్టు పెట్టేందుకు కుట్ర జరుగుతుందని, దానిని అందరూ కలిసి అడ్డుకోవాల్సి ఉందని కార్మికసంఘాలు కోరారు. ఆర్టీపీపీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మంగళవారం ఆర్టీపీపీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రధాన గేటు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆర్టీపీపీని పరిరక్షించుకునేందుకు తీసుకోవాల్సిన కార్యక్రమాలపై పోరాటాలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. తర్వాత ఆర్టీపీపీ గేటు వద్ద నుంచి కార్మిక సంఘాలు పెద్దఎత్తున ర్యాలీగా బయలుదేరి పరిపాలన విభాగం ఎదుట ఆర్టీపీపీ సీఈ సుబ్రమణ్యంరాజుకు వినతిపత్రం అందించారు. తదుపరి ఏపీజెన్కో ఎండీకి, ఇంధన కార్యదర్శిని కలిసి విన్నవించడం, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలను కలిసి ఆర్టీపీపీ సమస్యలను వివరించడం, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి, రాష్ట్ర ముఖ్యమంత్రిని కలసి ఆర్టీపీపీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరడం తదితర నిర్ణయాలను చేయాలని కమిటి తీర్మానం చేసినంట్లు కార్మిక సంఘాలు నాయకులు తెలిపారు. -
ఆటోను ఢీకొన్న టిప్పర్
ఎర్రగుంట్ల: మండల కేంద్రమైన ఎర్రగుంట్ల పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిపైన శనివారం తెల్ల వారిజామున 5 గంటలకు టీప్పర్ అతి వేగంగా ఆటోను ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా 9 మంది గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు కమలాపురం మండలం పందిర్లపల్లె గ్రామానికి చెందిన సుబ్బరాయుడు కుటుంబీకులు అనంతపురం జిల్లా గుత్తికి క్రైస్తవ ప్రార్థన కోసం వెళ్లారు. ప్రార్థన పూర్తి చేసుకోని గుత్తి నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో బయలు దేరారు. ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో దిగి పందిర్లపల్లె గ్రామానికి పోవడానికి ఆటోలో గంగమ్మ, నాగలక్ష్మి, చిన్నగంగన్న, సుజాత, సుగణమ్మ, రాధ, స్వర్ణలత, కిరణ్ బయలుదేరారు. చిలంకూరుకు చెందిన దేవరాజ్ కూడా ఎక్కారు. ఆటో నాలుగు రోడ్ల వద్దకు వస్తున్న సమయంలో ఎదురుగా ప్రొద్దుటూరు పోతున్న టీప్పర్ «ఢీకొంది. ఈ ప్రమాదరంలో గంగమ్మ (35) తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. నాగలక్ష్మి, చిన్నగంగన్న, సుజాత, సుగణమ్మ, రాధ, స్వర్ణలత, కిరణ్ మరో ఇద్దరికి తీవ్రగాయలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి 108 వాహనంలో క్షతగాత్రులను ప్రొద్దుటూరు ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు.. సుజాత పరిస్థితి విషయమించడంతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపైన పడి ఉన్న ఆటోను పక్కకు తీసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతురాలు భర్త సుబ్బరాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ భూషణం తెలియజేశారు. -
కుప్పకూలిన స్లాబ్: ఐదుగురికి తీవ్రగాయాలు
ఎర్రగుంట్ల (వైఎస్సార్ జిల్లా) : ఎర్రగుంట్ల మండల ఏరువాక వీధిలో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కుప్ప కూలిపోవడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటి పైభాగంలో నిర్మాణ పనులకు గాను ఇసుకను తీసుకెళుతున్న క్రమంలో స్లాబ్ కూలి కూలీలపై పడింది. అరుణమ్మ, కళావతి, శివకుమార్, రవి, ప్రసన్నలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జమ్మలమడుగు వైఎస్సార్సీపీ నాయకుడు డాక్టర్ సుధీర్ రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. -
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత
ఎర్రగుంట్ల (వైఎస్సార్ జిల్లా) : భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటుతున్నా పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులు యధేచ్చగా ఇసుక అక్రమ రవాణా చేస్తుండటంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఇసుక రవాణాను అడ్డుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం హనుమగుత్తిలో ఆదివారం చోటుచేసుకుంది. ఇసుక ర్యాంపు వద్ద నుంచి పరిమితులకు మించి ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించిన స్థానికులు ఆదివారం ఇసుక తరలిస్తున్నవారిని నిలదీశారు. దీంతో ఆగ్రహించిన అధికార పార్టీ నాయకులు ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సురేష్‌ను రంగంలోకి దించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆయన స్థానికులను బెదిరింపులకు గురి చేశారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు డాక్టర్ సుధీర్ రెడ్డి భూగర్భజలాలు అడుగంటుతున్నాయని ఆయనతో చెప్పడం ప్రారంభించారు. ఒక స్థాయిలో వీరి మధ్య వాదన కాస్తా తోపులాటగా మారి ఉద్రిక్తతకు దారితీసింది. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను నచ్చజెప్పి సోమవారం రెవెన్యూ అధికారుల సాయంతో హద్దులు నిర్ణయిస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
రేషన్ దుకాణం సీజ్
ఎర్రగుంట్ల: దుకాణంలో సరుకులు ఉన్నా ఇవ్వకపోవడంతో తహశీల్దార్ మహేశ్వర్‌రెడ్డి ఆ దుకాణాన్ని తనిఖీ చేసి సీజ్ చేశారు. ఈ సంఘటన గురువారం వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో జరిగింది. వివరాలు.. మున్సిపాలిటీలోని ఆరో నంబర్ రేషన్ దుకాణంలో నిత్యం సరుకుల కొరత ఉందని, ప్రజలకు అరకొరగా సరుకులు ఇస్తున్నారు. అంతేకాకుండా బియ్యం తూకాల్లో తేడా రావడం, కిరోసిన్ ఉన్నా లేదని చెబుతుండటంతో ప్రజలు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో తహశీల్దార్ దుకాణాన్ని తనిఖీ చేసి జరుగుతున్న అక్రమాలను గుర్తించి సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్టీపీసీలో పేకాటరాయుళ్ల అరెస్ట్
ఎర్రగుంట్ల (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) కార్యాలయంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారంతో కల్లమల పోలీసులు మంగళవారం సాయంత్రం దాడి చేసి ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 28 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
బస్టాండ్‌లో గుర్తుతెలియని వృద్ధుని మృతి
ఎర్రగుంట్ల (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో గుర్తు తెలియని వృద్ధుడు మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. దాదాపు 60 సంవత్సరాల వయసున్న వృద్ధుడు గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవించేవాడు. కాగా మంగళవారం సాయంత్రం బస్టాండ్ ఆవరణలో హఠాత్తుగా మృతిచెందాడు. గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. వృద్ధుని వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పంచాయతీవారికి అప్పగించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా ప్రారంభమైన ఎడ్ల పందాలు
ఎర్రగుంట్ల (వైఎస్ఆర్జిల్లా) : ఏరువాక గంగమ్మతల్లి జాతర మహోత్సవం(ఆవులపబ్బము) సందర్భంగా సోమవారం వైఎస్ఆర్జిల్లా ఎర్రగుంట్లలోని జెడ్పీ క్రీడామైదానంలో ఎడ్ల పోటీలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలలో వివిధ జిల్లాల నుంచి 14 ఎడ్ల జతలు పాల్గొంటున్నాయి. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.50వేలు నిర్ణయించారు. -
ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు సార్లు
ఒకటికాదు.. రెండు కాదు.. మూడు సార్లు విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వరించింది. అధికార పార్టీ ప్రలోభాలు, కుట్రలు, కుతంత్రాలు పటాపంచలయ్యాయి. అధికార జులుం మట్టికరిచింది. లాటరీ ధర్మాన్ని పలికింది. దాంతో రెండో జిల్లా పరిషత్ పీఠాలు వైఎస్ఆర్ సీపీకే దక్కాయి. వైఎస్ఆర్ జిల్లా, నెల్లూరు జిల్లాలో లాటరీ ద్వారా జెడ్పీ పీఠం వైఎస్సార్సీపీ దక్కించుకుంది. వివరాల్లోకి వెళితే వైఎస్ఆర్ జిల్లాలోని జిల్లాలోని ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో 18 కౌన్సిలర్ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. టీడీపీకి కేవలం రెండు స్థానాలే దక్కాయి. అనూహ్యంగా 8 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు టీడీపీ ప్రలోభాలకు లొంగారు. దాంతో ఇరువర్గాల బలం సమానమైంది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరావు మనోధైర్యాన్ని నింపారు. తన స్వగ్రామమైన దేవగుడిలో శిబిరం ఏర్పాటు చేయించారు. అధికారులు లాటరీ వేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు వైఎస్సార్సీపీకే దక్కాయి. అలాగే జమ్మలమడుగులో 9 స్థానాలను వైఎస్సార్సీపీ, 11స్థానాలను టీడీపీ దక్కించుకుంది. ఎమ్మెల్యే, కడప ఎంపీ ఓటుతో వైఎస్సార్సీపీ బలం 11కు పెరిగింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ కూడా లాటరీ అనివార్యమైంది. దాంతో అధికారులు లాటరీ తీయటంతో చైర్మన్ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వరించింది. ఇక నెల్లూరు జెడ్పీ వ్యవహారం హైకోర్టు వరకూ వెళ్లింది. జిల్లాలోని 46 జెడ్పీటీసీల్లో వైఎస్సార్సీపీ 31, టీడీపీ 15 స్థానాలను దక్కించుకున్నాయి. అయితే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ప్రలోభాలు, బుజ్జగింపులు, బెదిరింపులు, అక్రమ కేసులతో చివరకు 8 మంది వైఎస్సార్సీపీ సభ్యులను తమ వైపు తిప్పుకుంది. పోలీసు అధికారులు సైతం అధికార పార్టీకి కొమ్ముకాశారు. మొదట ఈ నెల 5న జరగాల్సిన ఎన్నిక అధికార పార్టీ సభ్యుల దౌర్జన్యాలు, దాడులతో వాయిదా పడింది. దాంతో ఈనెల 20వ తేదీన ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఇక్కడ కూడా లాటరీ అనివార్యమైంది. ఎట్టకేలకు ఆదివారం జరిగిన ఎన్నికలో వైఎస్సార్సీపీ లాటరీ ద్వారా ఘన విజయం సాధించింది. మరోవైపు జిల్లా పరిషత్‌లను దక్కించుకొనేందుకు టీడీపీ ఎన్ని అడ్డదారులు తొక్కినా చివరకు భంగపాటు తప్పలేదు. అధికారం తమదేనన్న గర్వంతో ఉన్న ఆ పార్టీ నేతలు జెడ్పీ చైర్మన్ పదవి కోసం అనేక అడ్డదారులు తొక్కారు. కోట్ల రూపాయలు ఇస్తామంటూ సభ్యులను ప్రలోభపెట్టారు. పోలీసుల సాయంతో బెదిరించారు. తప్పుడు కేసులు పెట్టారు. రెండు మార్లు ఎన్నికను వాయిదా వేయించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. జిల్లా ప్రజల ఛీత్కారం ఎదుర్కొన్నారు. చివరకు వారికి భంగపాటే ఎదురైంది. -
చంద్రబాబు నాయుడు కూడా అంతే: వైఎస్ జగన్
కడప : ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనుకునేవారు కాలగర్భంలో కలిసి పోయారని, చంద్రబాబు నాయుడు కూడా అంతేనని, అటువంటి నియంతలు ఎక్కువ కాలం నిలబడరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం జమ్మలమడుగు కౌన్సిలర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఎర్రగుంట్లలో 20 కౌన్సిలర్ స్థానాలకు 18 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని, అయితే ప్రజాస్వామ్యం కుంటుపడి కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు క్యాంప్‌లను నిర్వహించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబు నాయుడు ఒత్తిడితో భయపెట్టి ఎనిమిదిమంది కౌన్సిలర్లను టీడీపీ తనవైపు తిప్పుకుందని, అయినా దేవుడు చంద్రబాబుకు మొట్టికాయ వేసి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలిపించాడన్నారు. నాలుగు జిల్లా పరిషత్‌లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అక్కడ యుద్ధ వాతావరణాన్ని సృష్టించి టీడీపీ గెలిచేందుకు యత్నించిందని వైఎస్ జగన్ అన్నారు. కడప తప్ప కర్నూలు, ప్రకాశం, నెల్లూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందన్నారు. చంద్రబాబు ఏకంగా జెడ్పీటీసీలతో ఫోన్లో మాట్లాడే స్థాయికి దిగజారారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. అయితే నిజమైన ప్రతిపక్షం చంద్రబాబు చేతిలో మోసపోయిన రైతులు, విద్యార్థులు, ప్రజలేనని వైఎస్ జగన్ అన్నారు. రాబోయే కాలంలో వారే బాబును నిలదీస్తారన్నారు. త్వరలో రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలుస్తామన్నారు. మీతోపాటు ఏ పోరాటం చేయడానికైనా తాను ముందుంటానని, అందరం కలిసికట్టుగా కలుద్దామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా కౌన్సిలర్లకు సూచించారు. -
ఎర్రగుంట్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్ సీపీ కైవసం
-
ఎర్రగుంట్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్ సీపీ కైవసం
కడప : వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మున్సిపల్ చైర్మన్ పదవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ప్రజాతీర్పుకు భిన్నంగా అనైతిక పద్ధతుల్లో జెడ్పీపీఠాన్ని దక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మొత్తం 20మంది కౌన్సిలర్లు ఉండగా, వైఎస్ఆర్ సీపీకి 10 ఓట్లు, టీడీపీకి 10 ఓట్లు వచ్చాయి. దాంతో ఓట్లు సమానంగా రావటంతో అధికారులు లాటరీ తీశారు. ఈ లాటరీలో వైఎస్ఆర్ సీపీ మున్సిపల్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. ఆపార్టీ అభ్యర్థి ముసలయ్య మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. -
ఎర్రగుంట్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఉత్కంఠ
కడప : వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఉత్కంఠ నెలకొంది. మొత్తం 20మంది కౌన్సిలర్లు ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 18 జెడ్పీటీసీల బలం ఉండగా, టీడీపీకి కేవలం రెండు జెడ్పీటీసీలు మాత్రమే ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉన్నా టీడీపీ ...ప్రలోభాలకు గురి చేస్తోంది. ప్రజాతీర్పుకు భిన్నంగా అనైతిక పద్ధతుల్లో జెడ్పీపీఠాన్ని దక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. నవ్విపోదురుగాక..నాకేటి సిగ్గు.. అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ వైఖరి ప్రస్పుటం అవుతోంది. -
చిత్తూరు మునిసిపల్ ఎన్నికల్లో గందరగోళం
-
వైఎస్సార్ రైతు పక్షపాతి: విజయమ్మ
-
పోట్లదుర్తిలో భారీ ఆగ్ని ప్రమాదం
పది గడ్డివాములు దగ్ధం సుమారు రూ.5 లక్షల నుంచి 6లక్షలు దాకా నష్టం ఎర్రగుంట్ల, న్యూస్‌లైన్ : ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని రెడ్డిగారి వీధిలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది గడ్డివాములు దగ్ధమయ్యూరుు. ఎస్. కులాయిరెడ్డి, పడిగపాటి వెంకటరెడ్డి, సురేష్‌రెడ్డి, గంగిరెడ్డి, వీరారెడ్డి, నంద్యాల సోమశేఖర్‌రెడ్డి, లక్ష్మిరెడ్డి అనే రైతులకు చెందిన గడ్డివాములు ద గ్ధం అయ్యూరుు. సుమారు రూ. 5 లక్షల నుంచి 6లక్షల వరకు నష్టం జరిగిందని రైతులు వాపోయారు. ఆర్టీపీపీ, ప్రొద్దుటూరు, కమలాపురం, జమ్మలమడుగు నుంచి ఆగ్నిమాపక సిబ్బంది వ చ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే వరి గడ్డి పూర్తి వాములు కాలిపోయూరుు. స్థానికులు కూడా మంటలను ఆర్పేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆది సోదరుడు జయరామిరెడ్డి రైతులను పరామర్శించారు. అక్కడ నుంచి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో ఫోన్ లో ఈ ఘటనపై మాట్లాడారు. ఎమ్మెల్యే కలెక్టరుతో మాట్లాడి ప్రభుత్వం ద్వారా నష్ట పరిహార విషయంలో రైతులను ఆదుకుంటామని చెప్పారని అన్నారు. మహిళ కు గాయూలు పోట్లదుర్తిలో గడ్డి వాములు కాలిపోతున్నాయని విషయం అందగానే మహిళా రైతు బి.వరలక్ష్మి సంఘటనా స్థలానికి పోతున్న సమయంలో మలుపు వద్ద క్రాస్ అవుతున్న ఫైర్ ఇంజన్ తగిలింది. వెంటనే స్థానికులు పక్కకు లాగేశారు. కాలుకు మాత్రం పెద్ద గాయం అయింది. వెంటనే స్థానికులు ట్రాక్టరులో ప్రొద్దుటూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పెద్దముడియంలో... పెద్దపసుపుల గ్రామంలో సోమవారం సాయంత్రం మూడు గడ్డివాములు దగ్ధం అయ్యాయి. రామచంద్రా రెడ్డి అనే రైతుకు చెందిన వాములు రెండు, వీరారెడ్డి అనే వ్యక్తికి చెందిన ఒక గడ్డి వామి అగ్నికి ఆహుతయ్యాయి. వీటి విలువ సుమారు రూ.1.30 లక్షలు ఉంటుందని 6గామస్తులు చెబుతున్నారు. ఎస్ఐ ప్రవీణ్‌కుమార్, ఆర్ఐ కొండయ్య, వీఆర్ఓలు పుల్లయ్య, కొండల్రావు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. జమ్మలమడుగు నుంచి ఫైరింజన్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. -
ఇరవై నెలల్లోగా ఆరో యూనిట్ పూర్తి
ఎర్రగుంట్ల,న్యూస్‌లైన్: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో నిర్మాణంలో ఉన్న 600 మెగావాట్ల ప్రాజెక్టు పనులు ఇరవై నెలల్లో పూర్తి చేసి యూనిట్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఏపీ జెన్కో ఎండీ కె.విజయానంద్ పేర్కొన్నారు. బుధవారం ఆర్టీపీపీలోని గెస్ట్‌హౌస్‌లో అధికారులు, ఆర్టీపీపీ పరిసర గ్రామాల సర్పంచ్‌లు, కార్మిక నాయకులు, స్ధానికులతో సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీపీపీలోని ఆరో యూనిట్ నిర్మాణ పనుల్లో ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవమే అన్నారు. అయినా ఇప్పటి నుంచి 20 నెలల్లోగా పనులు పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపారు. కంపెనీ ప్రతినిధులతో ఇది వరకే మాట్లాడి పనులు వేగంగా చేయాలని ఆదేశించామన్నారు. బాయిలర్ , ఈఎస్పీ పనులు బాగా జరుగుతున్నాయని, ఇంకా జరగని పనులపై దృష్టి సారించి వాటిని వేగంగా చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. కూలింగ్ టవర్ డిజైన్‌లో ఏర్పడిన సమస్య కారణంగా టవర్ నిర్మాణం కొంత ఆలస్యమవుతోందన్నారు. మార్చికి కృష్ణపట్నంలో 1600 మెగా వాట్ల ప్రాజెక్టు పనులు పూర్తి 2014 జనవరి నాటికల్లా కృష్ణపట్నంలోని 800 మెగావాట్ల ప్రాజెక్టు ఒక దశ పనులు పూర్తి చేస్తామని, అలాగే మార్చి నాటికి మరో 800 మెగావాట్ల ప్రాజెక్టు పనులు పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఎండీ విజయానంద్ తెలిపారు. అలాగే భూపాల్పల్లిలోని 600 మెగావాట్ల పనులను 2014 మే నాటికి పూర్తి చేస్తామన్నారు. కొత్త ప్రాజె క్టులకు అనుమతులు విజయవాడ, కొత్తగూడెం, కృష్ణపట్నంలలో అదనంగా 800 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయని విజయానంద్ తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నింటిని నాలుగు సంవత్సరాల్లోగా పూర్తి చేస్తామన్నారు. ఏపీ జెన్కో ఎండీ విజయానంద్‌కు వినతుల వెల్లువ ఏపీజెన్కో ఎండీ కె. విజయానంద్‌కు ఆర్టీపీపీ చుట్టు ప్రక్కల గల ఎనిమిది గ్రామాల సర్పంచ్‌లు వినతిపత్రాలు అందజేశారు. గ్రామాలలో సమస్యలను పరిష్కరించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు. అనంతరం కార్మిక నాయకులు కలిసి మెయింటైన్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ప్రమోషన్లు కల్పించాలని, గ్రేడింగ్‌ల ప్రకారం వేతనం అందించాలని కోరారు. ఈ వినతులపై ఎండీ విజయానంద్ సానుకూలంగా స్పందించారు. ప్లాంట్ పరిశీలన.. ఆర్టీపీపీలోని యూనిట్లను ఎండీ విజయానంద్ పరిశీలించారు. అనంతరం ఆర్టీపీపీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెన్కో డెరైక్టర్ రాధాకృష్ణ, ఆర్టీపీపీ సీఈ కుమార్‌బాబు, ఎస్ఈలు ఇతర అధికారులు పాల్గొన్నారు.