
కదిరివారిపల్లెలో జ్వరంతో చిన్నారి మృతి
ఎర్రగుంట్ల: మండల పరిధిలోని కదిరివారిపల్లెకు చెందిన సింధూరి (2) అనే చిన్నారి రక్తకణాలు తగ్గి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కదిరివారిపల్లెకు చెందిన రాజ, తబితల కుమార్తె సింధూరి. కొన్ని రోజుల జ్వరం రావడంతో ప్రొద్దుటూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. తర్వాత డెంగీ వచ్చినట్లు, కర్నూల్‌కు వెళ్లాని వైద్యులు సూచించారు. దీంతో హుటాహుటిన కర్నూల్‌కు తీసుకెళ్లారు. అక్కడ రక్తకణాలు 30 వేలకు పడిపోయి చిన్నారి సుంధూరి మృతి చెందిన తల్లిదండ్రులు వాపోయారు. స్థానిక వైద్యాధికారి సాంబశివారెడ్డి వైద్య రిపోర్టులను పరిశీలించారు. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో మృతి చెందినట్లు తెలిపారు. డెంగీ లక్షణాలు లేవన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఎం. సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్ మైసురారెడ్డి తనయుడు రఘుకార్తీక్‌రెడ్డిలు గ్రామానికి పోయి పరామర్శించారు.