
ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా..
సాక్షి, కడప : జిల్లాలోని ఎర్రగుంట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు.