లారీపై నుంచి జారి పడి డ్రైవర్‌ దుర్మరణం | Lorry Driver Died In Road Accident | Sakshi
Sakshi News home page

లారీపై నుంచి జారి పడి డ్రైవర్‌ దుర్మరణం

Published Sat, Jan 28 2017 10:24 PM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

లారీపై నుంచి జారి పడి డ్రైవర్‌ దుర్మరణం

లారీపై నుంచి జారి పడి డ్రైవర్‌ దుర్మరణం

ఎర్రగుంట్ల: మండల పరిధిలోని తిప్పలూరు గ్రామ సమీపంలో ఉన్న ల్యాంకో క్వారీ వద్ద లారీపై నుంచి జారి పడి డ్రైవర్‌ మహబూబ్‌బాషా(46) దుర్మరణం చెందాడు. సంఘటన çస్థలాన్ని ఎస్‌ఐ వెంకటనాయుడు పరిశీలించారు. ఆయన కథనం మేరకు ఎర్రగుంట్ల పట్టణంలోని రాణివనం కాలనీకి చెందిన మహబూబ్‌బాషా లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తిప్పలూరు సమీపంలోని ల్యాంకో క్వారీ నుంచి లోడును శ్రీకాళహస్తికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. లారీపైన పట్టను సరిచేస్తున్న సమయంలో కింద ఉన్న మరో డ్రైవర్‌ లారీని కదిలించగా జారి కింద పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్యా పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే జెడ్పీ చైర్మన్‌ గూడూరు రవి, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ఎం.సుధీర్‌రెడ్డిలు సంఘటన స్థలాన్ని సందర్శించి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement