పోట్లదుర్తిలో భారీ ఆగ్ని ప్రమాదం
పది గడ్డివాములు దగ్ధం
సుమారు రూ.5 లక్షల నుంచి 6లక్షలు దాకా నష్టం
ఎర్రగుంట్ల, న్యూస్‌లైన్ : ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని రెడ్డిగారి వీధిలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది గడ్డివాములు దగ్ధమయ్యూరుు. ఎస్. కులాయిరెడ్డి, పడిగపాటి వెంకటరెడ్డి, సురేష్‌రెడ్డి, గంగిరెడ్డి, వీరారెడ్డి, నంద్యాల సోమశేఖర్‌రెడ్డి, లక్ష్మిరెడ్డి అనే రైతులకు చెందిన గడ్డివాములు ద గ్ధం అయ్యూరుు. సుమారు రూ. 5 లక్షల నుంచి 6లక్షల వరకు నష్టం జరిగిందని రైతులు వాపోయారు. ఆర్టీపీపీ, ప్రొద్దుటూరు, కమలాపురం, జమ్మలమడుగు నుంచి ఆగ్నిమాపక సిబ్బంది వ చ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే వరి గడ్డి పూర్తి వాములు కాలిపోయూరుు. స్థానికులు కూడా మంటలను ఆర్పేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆది సోదరుడు జయరామిరెడ్డి రైతులను పరామర్శించారు. అక్కడ నుంచి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో ఫోన్ లో ఈ ఘటనపై మాట్లాడారు. ఎమ్మెల్యే కలెక్టరుతో మాట్లాడి ప్రభుత్వం ద్వారా నష్ట పరిహార విషయంలో రైతులను ఆదుకుంటామని చెప్పారని అన్నారు.
మహిళ కు గాయూలు
పోట్లదుర్తిలో గడ్డి వాములు కాలిపోతున్నాయని విషయం అందగానే మహిళా రైతు బి.వరలక్ష్మి సంఘటనా స్థలానికి పోతున్న సమయంలో మలుపు వద్ద క్రాస్ అవుతున్న ఫైర్ ఇంజన్ తగిలింది. వెంటనే స్థానికులు పక్కకు లాగేశారు. కాలుకు మాత్రం పెద్ద గాయం అయింది. వెంటనే స్థానికులు ట్రాక్టరులో ప్రొద్దుటూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
పెద్దముడియంలో...
పెద్దపసుపుల గ్రామంలో సోమవారం సాయంత్రం మూడు గడ్డివాములు దగ్ధం అయ్యాయి. రామచంద్రా రెడ్డి అనే రైతుకు చెందిన వాములు రెండు, వీరారెడ్డి అనే వ్యక్తికి చెందిన ఒక గడ్డి వామి అగ్నికి ఆహుతయ్యాయి. వీటి విలువ సుమారు రూ.1.30 లక్షలు ఉంటుందని 6గామస్తులు చెబుతున్నారు. ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, ఆర్‌ఐ కొండయ్య, వీఆర్‌ఓలు పుల్లయ్య, కొండల్‌రావు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. జమ్మలమడుగు నుంచి ఫైరింజన్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.