
ఎర్రగుంట్ల: ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర గురువారం ఉదయం ఎర్రగుంట్ల మండలంలోకి ప్రవేశించనున్నట్లు వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఎం. సుధీర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఎర్రగుంట్లలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. గురువారం ఉదయం సర్వరాజపేట నుంచి ప్రజా సంకల్పయాత్ర మండలంలో ప్రవేశి స్తుందన్నారు. సర్వరాజపేటలో ప్రారంభమై పెద్దనపాడుకు చేరుకుంటుందని, అక్కడ కార్యకర్తలతో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మర్తల సాంబశివారెడ్డితో పాటు మరి కొందరు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. వై కోడూరు గ్రామ సమీపంలోని దేవాలయంలో వైఎస్ జగన్ పూజలు చేస్తారని తెలిపారు.
తరువాత గ్రామ క్రాస్ రోడ్డు, జువారి క్రాస్ రోడ్డు వద్ద సమావేశం, మధ్యాహ్నం వేంపల్లి రోడ్డులోని జయశంకర్‌రెడ్డి పెట్రోల్ బంకు వద్ద భోజనం చేస్తారని తెలిపారు. 2.30 గంటలకు ఎర్రగుంట్లలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద బహిరంగ సభతో పాటు జెండా ఆవిష్కరణ ఉంటుందన్నారు. తరువాత బ్రిడ్జి మీదుగా మెయిన్ బజార్ వరకు పాదయాత్ర సాగుతుందని తెలిపారు. అక్కడి శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరీ దేవి ఆలయంలో పూజలు చేస్తారని వివరించారు. తరువాత రాణివనం, ప్రకాశ్‌నగర్ కాలనీల మీదుగా బైపాస్‌రోడ్డు వరకు పాదయాత సాగుతుందన్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొనాలని ఆయన కోరారు. పార్టీ జిల్లా కార్యదర్శి జయరామకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు డి. వెంకటశివారెడ్డి, రైల్వే కాంట్రాక్టర్ వెంకట్రామిరెడ్డి, రామచంద్రారెడ్డి, ఎరికల్‌రెడ్డి, రామశేఖర్‌రెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, యూసోఫ్ ఇల్లూరు వెంకటసుబ్బారెడ్డిలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment