ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో అదివారం గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సుమారు 100 కుటుంబాల వారు వార్డుకు చెందిన చీపాడు ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వీరికి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి కండవాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం కేవలం టీడీపీ కార్యకర్తలకు కోసమే పనిచేస్తోందన్నారు. అందుకే యువకులు పార్టీలో చేరుతున్నారని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో కె. హరిక్రిష్ణ, కె. వేణుగోపాల్, ఎం వెంకటక్రిష్ణ, పవన్‌కుమార్, సాయి, మస్తాన్, మణి, వినయ్, కమల్, శివ, సుమన్‌ల తదితరులు ఉన్నారు.