హైదరాబాద్: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఖైరతాబాద్లో బుధవారం పౌరసరఫరాల భవన్ వద్ద కాంగ్రెస్ ధర్నాకు దిగింది. ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉల్లి సహా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి మండిపడ్డారు. సామాన్యులకు నిత్యావసర ధరలు అందుబాటులో లేవని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించుకునేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టాలని సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు.