సాక్షి, కడప: ముంపు గ్రామాల బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం ఆయన వైఎస్సార్ జిల్లా గండికోట ముంపు గ్రామాల్లో పర్యటించారు. ఆందోళన నిర్వహిస్తున్న తాళ్ల పొద్దుటూరు గ్రామస్తులతో చర్చించారు. దీంతో ఇళ్లు ఖాళీ చేయడానికి గ్రామస్తులు ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం 900 కోట్లు పరిహారం చెల్లిందని తెలిపారు. గత ఏడాది కంటే ఎక్కువ టీఎంసీల నీరు నింపుకుంటే మేలు జరుగుతుందన్నారు. కలెక్టర్, జేసీల సమక్షంలో ముంపు వాసుల చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని సుధీర్‌రెడ్డి తెలిపారు. (చదవండి: అంతరాష్ట్ర బస్సులు: 14న కీలక భేటీ)
Comments
Please login to add a commentAdd a comment