
ప్రచారానికి సిద్ధమైన వైఎస్సార్ సీపీ నేతలను మంత్రి ఆదినారాయణరెడ్డి ఆదేశాల మేరకు...
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ మరోసారి తన జులుం ప్రదర్శించింది. ప్రచారానికి సిద్ధమైన వైఎస్సార్ సీపీ నేతలను మంత్రి ఆదినారాయణరెడ్డి ఆదేశాల మేరకు హౌస్ అరెస్ట్ చేయటంతో జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో ఎంపీ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఇంచార్జ్ సుధీర్ రెడ్డిలు శనివారం ప్రచారానికి సమయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సున్నపురాళ్లపల్లిలో మంత్రి ఆదినారాయణ ప్రభావం ఉందంటు సుధీర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పులివెందులలో వైఎస్ అవినాష్‌రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న వైఎస్సార్ సీపీ నేతల ప్రచారానికి అనుమతించిన పోలీసులు నేడు నిరాకరించటం గమనార్హం.