
సాక్షి, మేడ్చల్: పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. మాజీ ఎమ్మెల్యే అయినా తన ఫొటోలు ఎక్కడా ఫ్లెక్సీల్లో పెట్టడం లేదంటూ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్ పట్టణంలో 50 పడకల ఆస్పత్రి శంకుస్థాపనకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు వచ్చిన విషయం విదితమే. శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు పూర్తి చేసుకుని మంత్రులు వేదిక వద్దకు వచ్చారు.
సమావేశ ఉపన్యాసకులు మంత్రులను వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వేదికపైకి రావాలని కోరారు. కానీ సుధీర్‌రెడ్డి వేదిక పైకి వెళ్లకుండా కార్యకర్తల మధ్యే కూర్చుకున్నారు. మంత్రి మల్లారెడ్డి సైతం పుండుమీద కారం చల్లినట్లు తన ప్రసంగం ప్రారంభ సమయంలో అందరి పేర్లు చెప్పి చివరిలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేరు పలకలేదు. మంత్రి హరీష్‌రావు అసలు ఆయన ఊసే ఎత్తకపోవడం గమనార్హం.
చదవండి: చర్చకు రమ్మంటే ముఖం చాటేస్తున్న ఈటల: ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment