ఎల్బీనగర్ లోని ఓ శంకుస్థాపన కార్యక్రమంలో కాంగ్రెస్ నేతల మధ్య చోటుచేసుకున్న విభేదాలు కాస్తా తారాస్థాయికి చేరాయి.
హైదరాబాద్: ఎల్బీనగర్ లోని ఓ శంకుస్థాపన కార్యక్రమంలో కాంగ్రెస్ నేతల మధ్య చోటుచేసుకున్న విభేదాలు కాస్తా తారాస్థాయికి చేరాయి. శంకుస్థాపన కార్యక్రమమానికి సంబంధించి శిలాఫలకం ఏర్పాట్లులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రామ్మోహన్ గౌడ్ వర్గీయులు మధ్య వివాదం రాజుకుంది. ఆ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సుధీర్ రెడ్డి ఫోటో లేకపోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ప్రోటోకాల్ ప్రకారం ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో పెట్టాలంటూ సుధీర్ రెడ్డి వర్గీయులు అలజడి సృష్టించారు. స్టేజ్ పైన ఉన్న ఫ్లెక్సీలను, ఫర్నీచర్ ను కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో రామ్మోహన్ గౌడ్ అనుచరులు కూడా రెచ్చిపోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.