రైతు దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జమ్మలమడుగులో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం టూర్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఉదయం 7 గంటలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన నివాసగృహం నుంచి బయల్దేరి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.