‘దమ్ముంటే టీడీపీ బీఫాం పై గెలవాలి' | mp avinash reddy fires on tdp | Sakshi
Sakshi News home page

‘దమ్ముంటే టీడీపీ బీఫాం పై గెలవాలి'

Published Sat, Mar 5 2016 11:13 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

‘దమ్ముంటే టీడీపీ బీఫాం పై గెలవాలి' - Sakshi

‘దమ్ముంటే టీడీపీ బీఫాం పై గెలవాలి'

జమ్మలమడుగు: తల్లి లాంటి పార్టీని దూషించడం తగదని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరడం సిగ్గుమాలిన చర్య అని, ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే శాసన సభ సభ్యత్వానికి రాజీనామ చేసి టీడీపీ బీఫాం పై గెలవాలన్నారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు సబ్‌జైలులో ఉన్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి బావమరిది బంగారి రెడ్డిని ఆయన ఈ రోజు కలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ కేసులు పెడుతోందన్నారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement