'ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఆది' | p. rama subba reddy takes on adinarayana reddy | Sakshi
Sakshi News home page

'ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఆది'

Published Mon, Apr 11 2016 10:15 AM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

'ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఆది'

'ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఆది'

జమ్మలమడుగు: ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ ముద్దు అంటూనే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరులు గ్రామాల్లో ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి విమర్శించారు. ఆదివారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఉగాది సందర్భంగా నియోజకవర్గంలోని పెద్దదండ్లూరు, సిరిగేపల్లి గ్రామాల కార్యకర్తలు, నాయకులు ఆయా గ్రామాల్లో ఆదివారం జరిగే దేవర ఉత్సవానికి తమను ఆహ్వానించారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోదరుడు రామాంజనేయరెడ్డి శ నివారం సిరిగేపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఇంటికి వెళ్లి రామసుబ్బారెడ్డిని, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడును దేవరకు ఎందుకు ఆహ్వానించావని బెదిరించాడన్నారు. అయినా కొంత మంది ధైర్యంగా వచ్చి తమను ఆహ్వానించారని పేర్కొన్నారు.

దీంతో తాను, సీఎం రమేష్ మరి కొంత మందితో కలిసి ఆదివారం పెద్దదండ్లూరు, సిరిగేపల్లి గ్రామాలకు వెళ్లి అక్కడి పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. తాము ఆ గ్రామాల నుంచి వచ్చిన తర్వాత ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, రామాంజనేయుల రెడ్డి వారి ఇతర సోదరులు దాదాపు 5 ట్రాక్టర్లలో దేవగుడి గ్రామం నుంచి అనుచరులను తీసుకెళ్లి గోపాల్‌రెడ్డి, నరసింహారెడ్డి, గోపన్న, గిన్నె బాలుడు అనే వ్యక్తులపై దాడులు చేయడంతో పాటు వారి ఇళ్లలోని సామగ్రిని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆది పైకి ఫ్యాషన్ అంటూ లోలోపల ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించే అనాగరిక చర్యలను మానుకోవాలని ఆయన సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement