ఆయనకు మ్యాన్షన్‌ హౌస్‌ గురించి బాగా తెలుసు! | Jammalamadugu MLA Sudheer Reddy Fires On Adinarayana Reddy | Sakshi
Sakshi News home page

ఆయనకు మ్యాన్షన్‌ హౌస్‌ గురించి బాగా తెలుసు!

Published Mon, Oct 28 2019 12:58 PM | Last Updated on Mon, Oct 28 2019 6:45 PM

Jammalamadugu MLA Sudheer Reddy Fires On Adinarayana Reddy - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిపై జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన విలేకరు సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెంగుళూరులో క్లబ్బులకు సెలవు కావడంతో జమ్మలమడుగుకు చుట్టపుచూపుగా వచ్చిన ఆదినారాయణరెడ్డి తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఆయనకు తోడబుట్టిన అన్నదమ్ములే ఆయన నిజస్వరూపం తెలుసుకొని దూరంగా ఉంచారన్నారు.

అన్నదమ్ముల నుంచి కూడా ప్రస్తుతం ఆదినారాయణకు ఎలాంటి సహకారం లేదన్నారు. ఆయనకు ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే మందుల గురించి తెలియదు కానీ, ప్రతిరోజు తీసుకునే మాన్షన్‌ హౌస్‌ గురించి మాత్రం బాగా తెలుసన్నారు. తాను ఉద్యోగాలు అమ్ముకున్నానని ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి వాటిని నిరూపిస్తే ఆ క్షణమే రాజీనామా చేస్తానని, దమ్ముంటే నిరూపించాలని సవాల్‌ విసిరారు. ఇప్పటికే అన్ని పార్టీలను మార్చిన ఆయనకు ఇక మిగిలింది జనసేన పార్టీ మాత్రమేనని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement