sudheerreddy
-
ఆయనకు మ్యాన్షన్ హౌస్ గురించి బాగా తెలుసు!
సాక్షి, వైఎస్సార్ జిల్లా : మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిపై జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన విలేకరు సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెంగుళూరులో క్లబ్బులకు సెలవు కావడంతో జమ్మలమడుగుకు చుట్టపుచూపుగా వచ్చిన ఆదినారాయణరెడ్డి తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఆయనకు తోడబుట్టిన అన్నదమ్ములే ఆయన నిజస్వరూపం తెలుసుకొని దూరంగా ఉంచారన్నారు. అన్నదమ్ముల నుంచి కూడా ప్రస్తుతం ఆదినారాయణకు ఎలాంటి సహకారం లేదన్నారు. ఆయనకు ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే మందుల గురించి తెలియదు కానీ, ప్రతిరోజు తీసుకునే మాన్షన్ హౌస్ గురించి మాత్రం బాగా తెలుసన్నారు. తాను ఉద్యోగాలు అమ్ముకున్నానని ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి వాటిని నిరూపిస్తే ఆ క్షణమే రాజీనామా చేస్తానని, దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ఇప్పటికే అన్ని పార్టీలను మార్చిన ఆయనకు ఇక మిగిలింది జనసేన పార్టీ మాత్రమేనని అన్నారు. -
సుధీర్‌రెడ్డికే ఎల్బీనగర్ సీటు
సాక్షి, రంగారెడ్డి జిల్లాప్రతినిధి: ఎట్టకేలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ముగిసింది. శనివారం విడుదల చేసిన జాబితాలో ఎల్బీనగర్ అభ్యర్థిగా దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని ప్రకటించింది. ఈ స్థానాన్ని టీడీపీకి సర్దుబాటు చేస్తారని మొదట్నుంచి ప్రచారం సాగినా కాంగ్రెస్‌కే వదిలేస్తూ మహాకూటమి నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో బీజేపీ, బీఎల్ఎఫ్ మినహా అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక క్రతువును పూర్తిచేశాయి. కాగా, తెలుగుదేశం పార్టీకి కేటాయించిన ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ సీట్ల విషయంలో పునరాలోచన చేస్తుందనే ప్రచారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు స్థానే వేరే సీట్లను టీడీపీకి కేటాయించి.. వీటిని కాంగ్రెస్ తీసుకుంటుందనే వార్తలకు ఆ పార్టీ తుది జాబితా విడుదల చేస్తే తప్ప ఫుల్స్టాప్ పడేలా లేదు. ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి ఆశలు సజీవంగా ఉండడంతో ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. అయితే, ఈ సెగ్మెంట్ టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి మెత్తబడ్డారు. శనివారం నాడు సామ రంగారెడ్డి నామినేషన్ కూడా దాఖలు చేయడంతో రంగం నుంచి తప్పుకునే సూచనలు కనిపించడం లేదు. వరుసగా రెండో రోజు కూడా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌ను కలిసి సహకారం అందించాలని కోరారు. కాగా, క్యామ కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పేర్కొంటూ నామినేషన్ వేయడం గమనార్హం. ఇక రాజేంద్రనగర్ విషయానికి వస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా బండ్ల గణేశ్ పేరు తెరమీదకు వస్తుండడం.. నామినేషన్లకు గడువు దగ్గర పడుతుండంతో ఆసక్తికరంగా మారింది. టీడీపీ అభ్యర్థి గణేశ్‌గుప్తా ఒక సెట్ నామినేషన్‌ను సమర్పించారు. -
అభివృద్ధి అంటే ఇదేనా..?
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్లలో అభివృద్ధి పనులు చేశామని ప్రతి సమావేశంలో గొప్పలు చెబుకుంటున్న మంత్రి అదినారాయణరెడ్డికి అభివృద్ధి అంటే పూరిగుడిసెలకు, ఇళ్ల నిర్మాణ పనులు పూర్తికాక మొండి గోడలకు విద్యుత్ బిల్లులు వేయడమేనా.. ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అంటూ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఎర్రగుంట్ల మున్సిపల్ పరిధిలోని సుందరయ్య కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో నివాసం ఉండే ప్రజలు తమ ఇళ్లకు వచ్చిన అధిక విద్యుత్ బిల్లులను చూపించి ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ వారు తమపై పన్నుల భారంతో విద్యుత్ బిల్లులు భారం మోపారని వారు వాపోయారు. చెట్ల కింద నివాసం ఉంటున్న మొండి గోడలకు కూడా విద్యుత్ బిల్లులు రూ.వేలల్లో వేస్తున్నారని వారు వాపోయారు. ఈ సందర్భంగా సమన్వయకర్త డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఎర్రగుంట్లను మున్సిపాలిటీ చేసి పేదల రక్తంను పన్నుల రూపంలో ఈ ప్రభుత్వం జలగలు లాక పీల్చేస్తోందన్నారు. కూలికి పోతే కానీ పూట గడవని నిరుపేదలపై పన్నులు, విద్యుత్ బిల్లుల భారం వేస్తున్నారని చెప్పారు. మంత్రి అదినారాయణరెడ్డి ఎక్కడ సమావేశం జరిగినా నేను ఎర్రగుంట్లను అభివృద్ధి చేశానని గొప్పలు చెబుతున్నారు, అభివృద్ధి అంటే వారి దృష్టిలో పూరిగుడిసెలకు, మొండి గోడలకు విద్యుత్ బిల్లులు వేయడమేనా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల పేదలకు తీరని అన్యాయం జరుగడమే కాక వారిని పన్నుల పేరుతో నిలువునా దోచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరు పేదలకు ఒక్క ఇళ్లు కూడా ముంజూరు చేయలేదని, దివంగత సీఎం వైఎస్సార్ హయాంలోనే ఎర్రగుంట్ల పట్టణంలో ఇళ్లు ఇచ్చి ఇందిరమ్మ కాలనీ నిర్మించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. టీడీపీ నేతలు సూచించిన వారికే ఇళ్లు ఇస్తున్నారని నిరుపేదలను మరిచారని తెలిపారు. త్వరలో టీడీపీకి ప్రజలు ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దాసరి సూర్యనారాయణరెడ్డి, మండల కో– ఆప్షన్ సభ్యులు అబ్దుల్‌గఫూర్, పార్టీ నాయకులు గంగాకృష్ణారెడ్డి, గంగాధర్‌రెడ్డి, ఇస్మాయిల్, సతీష్‌కుమార్‌రెడ్డి, ముబారక్ బాష, మహబూబ్షరిఫ్లు పాల్గొన్నారు. మొండిగోడలకు వచ్చిన విద్యుత్ బిల్లులు చూపించి నిరసన వ్యక్తం చేస్తున్న డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి, కాలనీవాసులు ఈ మొండిగోడలకే వచ్చిన విద్యుత్ బిల్లులు -
అన్నా...ఈ సొరకాయ రేటెంత?
బోడుప్పల్: ‘అన్నా..ఈ సొరకాయ రేటెంత? దీన్ని మీరే పండించారా...గిట్టుబాటు అవుతోందా...’ అంటూ మంత్రి హరీష్‌రావు రైతుబజార్లో కూరగాయల రైతులను ఆరా తీశారు. బోడుప్పల్ సమీపంలోని మేడిపల్లిలో రూ.60 లక్షల వ్యయంతో నిర్మించిన రైతుబజార్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రైతుబజార్లో కలియతిరుగుతూ రైతులతో మాట్లాడారు. కూరగాయల ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లలో దళారీ వ్యవస్థను పూర్తిగా నివారిస్తామని, ఆరుగాలం కష్టపడి సాగుచేసే రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హరీష్ వెంట మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులున్నారు. - మేడిపల్లి