ఎర్రగుంట్ల : ఎర్రగుంట్లలో అభివృద్ధి పనులు చేశామని ప్రతి సమావేశంలో గొప్పలు చెబుకుంటున్న మంత్రి అదినారాయణరెడ్డికి అభివృద్ధి అంటే పూరిగుడిసెలకు, ఇళ్ల నిర్మాణ పనులు పూర్తికాక మొండి గోడలకు విద్యుత్ బిల్లులు వేయడమేనా.. ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అంటూ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఎర్రగుంట్ల మున్సిపల్ పరిధిలోని సుందరయ్య కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో నివాసం ఉండే ప్రజలు తమ ఇళ్లకు వచ్చిన అధిక విద్యుత్ బిల్లులను చూపించి ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ వారు తమపై పన్నుల భారంతో విద్యుత్ బిల్లులు భారం మోపారని వారు వాపోయారు. చెట్ల కింద నివాసం ఉంటున్న మొండి గోడలకు కూడా విద్యుత్ బిల్లులు రూ.వేలల్లో వేస్తున్నారని వారు వాపోయారు. ఈ సందర్భంగా సమన్వయకర్త డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఎర్రగుంట్లను మున్సిపాలిటీ చేసి పేదల రక్తంను పన్నుల రూపంలో ఈ ప్రభుత్వం జలగలు లాక పీల్చేస్తోందన్నారు.
కూలికి పోతే కానీ పూట గడవని నిరుపేదలపై పన్నులు, విద్యుత్ బిల్లుల భారం వేస్తున్నారని చెప్పారు. మంత్రి అదినారాయణరెడ్డి ఎక్కడ సమావేశం జరిగినా నేను ఎర్రగుంట్లను అభివృద్ధి చేశానని గొప్పలు చెబుతున్నారు, అభివృద్ధి అంటే వారి దృష్టిలో పూరిగుడిసెలకు, మొండి గోడలకు విద్యుత్ బిల్లులు వేయడమేనా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల పేదలకు తీరని అన్యాయం జరుగడమే కాక వారిని పన్నుల పేరుతో నిలువునా దోచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరు పేదలకు ఒక్క ఇళ్లు కూడా ముంజూరు చేయలేదని, దివంగత సీఎం వైఎస్సార్ హయాంలోనే ఎర్రగుంట్ల పట్టణంలో ఇళ్లు ఇచ్చి ఇందిరమ్మ కాలనీ నిర్మించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.
టీడీపీ నేతలు సూచించిన వారికే ఇళ్లు ఇస్తున్నారని నిరుపేదలను మరిచారని తెలిపారు. త్వరలో టీడీపీకి ప్రజలు ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దాసరి సూర్యనారాయణరెడ్డి, మండల కో– ఆప్షన్ సభ్యులు అబ్దుల్‌గఫూర్, పార్టీ నాయకులు గంగాకృష్ణారెడ్డి, గంగాధర్‌రెడ్డి, ఇస్మాయిల్, సతీష్‌కుమార్‌రెడ్డి, ముబారక్ బాష, మహబూబ్‌షరిఫ్‌లు పాల్గొన్నారు.
మొండిగోడలకు వచ్చిన విద్యుత్ బిల్లులు చూపించి నిరసన వ్యక్తం చేస్తున్న డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి, కాలనీవాసులు
ఈ మొండిగోడలకే వచ్చిన విద్యుత్ బిల్లులు
Comments
Please login to add a commentAdd a comment