![అన్నా...ఈ సొరకాయ రేటెంత? - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/61435637944_625x300.jpg.webp?itok=_ShqR_0J)
అన్నా...ఈ సొరకాయ రేటెంత?
బోడుప్పల్: ‘అన్నా..ఈ సొరకాయ రేటెంత? దీన్ని మీరే పండించారా...గిట్టుబాటు అవుతోందా...’ అంటూ మంత్రి హరీష్‌రావు రైతుబజార్‌లో కూరగాయల రైతులను ఆరా తీశారు. బోడుప్పల్ సమీపంలోని మేడిపల్లిలో రూ.60 లక్షల వ్యయంతో నిర్మించిన రైతుబజార్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రైతుబజార్లో కలియతిరుగుతూ రైతులతో మాట్లాడారు.
కూరగాయల ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లలో దళారీ వ్యవస్థను పూర్తిగా నివారిస్తామని, ఆరుగాలం కష్టపడి సాగుచేసే రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హరీష్ వెంట మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులున్నారు. - మేడిపల్లి