హైదరాబాద్: ఇక నుంచి రైతు బజార్లలో రైతులు నేరుగా ఉల్లిగడ్డ అమ్మే సౌకర్యాలు కల్పించి వారిని ఆదుకోవాలని మార్కెటింగ్ శాఖమంత్రి హరీష్ రావు ఆ శాఖా అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు 70 శాతం రాయితీపై ఉల్లిగడ్డల విత్తనాలు సరఫరా చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. రైతు బజార్లలో ఒక కిలోకు 11 రూపాయలకు తక్కువ కాకుండా అమ్ముకోవటానికి ప్రత్యేక సదుపాయలు కల్పించాలని చెప్పారు.
మంత్రి హరీష్ ఆదేశాలను అనుసరించి పర్యవేక్షణ అధికారి జంట నగరాలలో ఉన్న రైతు బజార్లలో ఎస్టేట్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, ఇందుకు సంబందించిన విధివిధానాలను రూపొందించారు. ఇందులో బాగంగా మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో ఉల్లిగడ్డ అత్యధికంగా పండించే మండలాలైన మొమిన్ పేట్, మర్ పల్లి, సిద్ధిపేట్, చేవెళ్ల, శంకర్ పల్లి, నవాబ్ పేట్, శివంపేట్ ప్రాంతాలలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించి, రైతు బజార్లలో తాము పండించిన ఉల్లి పంటను అమ్ముకునే విధంగా చూడాలని ఆదేశించారు.
ఉల్లిని రైతులు నేరుగా బజార్లో అమ్మవచ్చు
Published Sat, Feb 20 2016 5:49 PM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM
Advertisement