వైఎస్ హాయంలోనే రాయలసీమ అభివృద్ధి
–దద్దమ్మల వ్యవహరిస్తున్న ప్రస్తుత పాలకులు
–రాయలసీమ రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు
జమ్మలమడుగు: రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే ఆది దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనేనని రాయలసీమ రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఆర్‌అండ్‌బీఅతిథి గృహాంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వైఎస్ గాలేరి –నగరి వరద కాలువతోపాటు, గండికోట ప్రాజెక్టులను 90శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం వచ్చిన పాలకులు దద్దమ్మలా వ్యవహరించడం వల్లే నేడు రాయలసీమ ప్రాంతానికి పూర్తిగా అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆధ్వర్యంలో నాయకులు కలిసికట్టుగాపోరాటం చేసి సాధించుకున్నారు. కానీ నేటి మన సీమ నాయకులు పార్టీలు మార్చుతూ అధికారం ఎటువైపు ఉంటే అటువైపునకు వెళ్లిపోతున్నారే తప్ప రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపె గళం విప్పే పరిస్థితులు లేకపోవడం మన దౌర్భగ్యం అన్నారు. ముఖ్యమంత్రి కూడా రాయలసీ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయకుండా నిత్యం వైజాగ్, అమరావతి, గుంటూరు ప్రాంతాలవైపు మొగ్గుచూపుతున్నారన్నారు. రాయలసీమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్‌లో 60శాతం నిధులను కేటాయించాలని, ప్రత్యేకంగా 10 లక్షల కోట్ల ప్యాకేజిని ప్రకటించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయన్నుట్లు తెలిపారు. ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు.