తెలుగుదేశం పార్టీ ఆగడాలు పెరిగిపోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు ఎస్టీ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు కత్తులతో దాడులు చేశారు.
ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. ఈ దాడికి నిరసనగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఇటీవలే కృష్ణా జిల్లాలో తమకు ఓటేయలేదని ఓ ఉపసర్పంచిని అత్యంత కిరాతకంగా చంపిన సంఘటనను ఇంకా మరువకముందే ఇలాంటి దాడులు జరగడం గమనార్హం.
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కత్తులతో టీడీపీ వర్గీయుల దాడి
Published Sat, Aug 16 2014 9:10 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement