వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో ప్రచారానికి వెళ్లిన తెలుగు తమ్ముళ్లకు ఊహించని విధంగా షాక్ తగిలింది.
కడప : వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో ప్రచారానికి వెళ్లిన తెలుగు తమ్ముళ్లకు ఊహించని విధంగా షాక్ తగిలింది. సోమవారం ఉదయం ప్రచారానికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామసుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసులరెడ్డికి గ్రామస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు చూపి నిరసన తెలిపారు. దాంతో ఖంగు తినటం టీడీపీ అభ్యర్థుల వంతైంది.