
సాక్షి, కడప: రైతు దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జమ్మలమడుగులో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం టూర్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఉదయం 7 గంటలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన నివాసగృహం నుంచి బయల్దేరి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 7 గంటల 30 నిమిషాలకు గన్నవరం నుంచి విమానంలో కడప బయల్దేరి వెళ్తారు. 8 గంటల 15 నిమిషాలకు కడప ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 8గంటల 35 నిమిషాలకు ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి వైఎస్‌ఆర్ సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత వైస్ఆర్ ఘాట్ వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గంలో బయల్దేరి 9గంటల 35 నిమిషాలకు గండి వీరాంజనేయస్వామిని దర్శించుకుంటారు. పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేస్తారు.
తిరిగి గండి టెంపుల్ నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరి ఇడుపులపాయ చేరుకుంటారు. 10గంటల 20 నిమిషాలకు ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 10గంటల 40 నిమిషాలకు జమ్మలమడుగు మండలం కన్నెలూరు చేరుకుంటారు. 10గంటల 50 నిమిషాలకు రైతు దినోత్సవ సభాస్థలికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం 11గంటల 15 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట 15 నిమిషాల వరకు వైఎస్ఆర్ రైతు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం తిరిగి తాడేపల్లికి పయనమవుతారు. సభ ముగిసిన వెంటనే ఒంటిగంట 35 నిమిషాలకు కన్నెలూరు నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:00 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరి 2గంటల 40 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్.
సీఎం వైఎస్ జగన్ పర్యటన ఇలా సాగనుంది..
- ఉదయం 7 గంటలకు సీఎం వైఎస్ జగన్ ఇంటి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు
- 7:30 గంటలకు గన్నవరం నుంచి విమానంలో కడపకు బయలుదేరుతారు
- 8:15 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు వెళ్తారు
- 8:35 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌కు సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారు
- 8:45 గంటలకు రోడ్డుమార్గంలో వైఎస్‌ఆర్ సమాధి వద్దకు వెళ్తారు
- 8:50 నుంచి 9:10 గంటల మధ్య వైస్ఆర్ ఘాట్ వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు
- 9:35 గంటలకు గండి వీరాంజనేయస్వామి దర్శనం చేసుకుంటారు
- 10:00 గంటలకు గండిలో పలు అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపనలు చేస్తారు
- 10:05 గంటలకు గండి టెంపుల్ నుంచి రోడ్డుమార్గంలో ఇడుపులపాయకు వెళ్తారు
- 10:20 నిమిషాలకు ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి..
- 10:40 గంటలకు జమ్మలమడుగు మండలం కన్నెలూరు సీఎం జగన్ చేరుకుంటారు.
- 10:50 గంటలకు సభాస్థలి వద్దకు వెళ్తారు
- 10:55 గంటల నుంచి 11:15 స్టాళ్లను పరిశీలన
- 11:15 గంటల నుంచి మధ్యాహ్నం 1:15 పబ్లిక్ మీటింగ్
- 1:35 గంటలకు కన్నెలూరు నుంచి హెలికాప్టర్‌లో కడప విమానాశ్రయానికి
- 2:00 గంటలకు కడప ఏయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరి..
- 2:40 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు
- 3:10 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి సీఎం వైఎస్ జగన్ తిరిగి చేరుకుంటారు