సాక్షి, అమరావతి : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు కర్మాగారానికి ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఈ కర్మాగారాన్ని నిర్మిస్తున్నారు. అంతకు ముందు సున్నపురాళ్లపల్లెకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే నేటి నుంచి మూడు రోజుల పాటు సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు.
సీఎం పర్యటనకు సంబంధించిన వివరాలు..
► 1.35 గంటలకు దువ్వూరు మండలం నేలటూరు గ్రామానికి చేరిక.
► 1.45 గంటలకు బహిరంగ సభాస్థలికి చేరుకుంటా రు. మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి బహిరంగసభలో పాల్గొంటారు.
► 3.40 గంటలకు కడప రిమ్స్‌కు వస్తారు.
► 3.55 నుంచి 4.05 గంటల వరకు కడప అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు.
► 4.15 గంటలకు వైఎస్సార్ ఉచిత భోజన, వసతి భవనం వద్దకు చేరుకుంటారు. 4.20 నుంచి 4.25 గంటల వరకు భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
► 4.45 గంటలకు కడప–రాయచోటి మార్గంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుతారు. 4.50 నుంచి 5.00 గంటల వరకు అక్కడి రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
► సాయంత్రం 5.55 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ వద్దకు చేరుకుంటారు.
24వ తేది కార్యక్రమాలు
► ఉదయం 9.10 నుంచి 9.40 గంటల వరకు వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి ఘాట్ వద్ద నివాళులు.
► 9.55 గంటలకు అక్కడున్న చర్చి వద్దకు వెళతారు.
► 10.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరిగే ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొంటారు.
► 1.40 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి 2.00 గంటలకు రాయచోటి జూనియర్ కళాశాల గ్రౌండ్ వద్దకు చేరుకుంటారు.
► మధ్యాహ్నం 2.15 నుంచి 4.15 గంటల వరకు రాయచోటి నియోజకవర్గంలో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు నిర్వహించి బహిరంగ సభలో పాల్గొంటారు.
► 5.10 గంటలకు ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు.
25వ తేది కార్యక్రమాలు
► ఉదయం 9.30 గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలిప్యాడ్‌లో దిగుతారు.
► 9.45 గంటలకు సీఎస్‌ఐ చర్చికి చేరుకుంటారు. 9.50 నుంచి 11.10 గంటల వరకు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు.
► 11.25 నుంచి 12.10 గంటల వరకు పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
► వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు
► 12.30 గంటలకు భాకరాపురంలోని నివాస గృహానికి చేరుకుంటారు.
► 2.35 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి 3.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 3.10 గంటలకు ఎయిర్‌పోర్టులో విమానంలో బయలుదేరి 4.00 గంటలకు గన్నవరం వెళతారు.
Comments
Please login to add a commentAdd a comment