ఆటో, స్కార్పియో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు.
జమ్మలమడుగు రూరల్ (వైఎస్సార్ జిల్లా) : ఆటో, స్కార్పియో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 4.45 గంటల సమయంలో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలంలో చోటుచేసుకుంది.
జమ్మలమడుగు నుంచి పెద్దమొడిగం వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను మండలంలోని ఎస్.ఉప్పల పాడు గ్రామం వద్ద ఎదురుగా కోయిలకుంట్ల వైపు వెళ్తున్న స్కార్పియో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ముగ్గురు గాయాలపాలయ్యారు. అందులో తీవ్రంగా గాయపడ్డ ఒకరిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి, స్వల్పంగా గాయపడ్డ ఇద్దరిని కడప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.